సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ ను.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారించారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో.. అల్లు అర్జున్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ చెక్ చేశారు. రక్త పరీక్షల కోసం.. రక్తం శాంపిల్స్ తీసుకున్నారు డాక్టర్లు.
ALSO READ | అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు: శిక్ష ఎన్నేళ్లు పడొచ్చు ?
గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల సమయంలో తండ్రి అల్లు అరవింద్, బన్నీ వాసుతోపాటు మరికొంత మంది అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు డాక్టర్లు. అల్లు అర్జున్ రాకతో గాంధీ ఆస్పత్రిలోనూ భారీ ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలోకి పేషెంట్లను మాత్రమే అనుమతించారు. ఫ్యాన్స్ వచ్చి హంగామా చేస్తారనే ఉద్దేశంతో.. ముందస్తుగానే భద్రత పెంచారు పోలీసులు.
గాంధీ ఆస్పత్రిలో 15 నిమిషాలు ఉన్న అల్లు అర్జున్.. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత.. పోలీస్ వాహనంలోనే అక్కడి నుంచి తరలించారు.