గ్రేట్ ఫ్యాన్: బన్నీ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని.. ఐకాన్ ఆప్యాయతకు ఫిదా!

గ్రేట్ ఫ్యాన్: బన్నీ కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన అభిమాని.. ఐకాన్ ఆప్యాయతకు ఫిదా!

వీరాభిమానులు (Die HardFans)..ఈ పదం వెనుక ఎంతో నిరీక్షణ ఉంటుంది. అదేంటీ అనుకుంటున్నారా? అవునండీ..ప్రతి హీరో అభిమాని తన ఫేవరేట్ హీరోని ఎలాగైనా కలవాలని అనుకుంటాడు. అలాగే తన అభిమానాన్ని మనసారా చాటాలనుకుంటున్నాడు.కానీ,దీన్ని వెనుక ఎంతో నిరీక్షణ ఉంటుంది.. ఎన్నో ప్రయత్నాలుంటాయి.

ఇపుడు అలాంటి ఒక అభిమాని తన అభిమాన హీరో కోసం ఏం చేశాడో చూస్తే..శభాష్ అంటారు.వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమాని ఉత్తర ప్రదేశ్‍లోని అలీగఢ్ నుంచి సైకిల్‍పై హైదరాబాద్‍కు వచ్చారు. అతను ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కి.. హైదరాబాద్‍కు చేరుకున్నాడనే వార్తా అల్లు అర్జున్కి తెలియడంతో షాక్ అయ్యారు బన్నీ. ఆ వెంటనే సదరు అభిమానిని హైదరాబాద్‍లో నేడు (అక్టోబర్ 16న) ఇంటికి పిలిపించారు. ఇక ఆ అభిమాని అల్లు అర్జున్ను చూడగానే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అల్లు అర్జున్ అతడిని ఆప్యాయంగా పలుకరించారు.

ALSO READ | Bigg Boss: యాంకర్ విష్ణు ప్రియ మాట‌ల‌కు ఏడ్చేసిన గంగవ్వ.. వీడియో వైరల్

ఎక్కడి నుంచి వచ్చావని అల్లు అర్జున్ అడగంతో.. తాను ఉత్తర ప్రదేశ్‍ నుంచి వచ్చానని ఆ అభిమాని చెబుతూ అల్లు అర్జున్ కాళ్లు మొక్కబోయారు. ఇక అక్కడి నుంచి ఎలా వచ్చావని అడిగితే.. సైకిల్‍పై వచ్చానని అని చెప్పాడంతో షాక్ అయ్యారు బన్నీ.ఇక ఆ అభిమానిని సైకిల్‍పై వెళ్లవద్దని.. ట్రైన్‍, ఫ్లైట్ ఏదో ఒకటి బుక్‍ చేసి జాగ్రత్తగా వారి ఇంటికి పంపాలని తమ అసిస్టెంట్స్కి అల్లు అర్జున్ ఆదేశించారు.

ఇక చివర్లో ఆ అభిమానికి పుష్ప 2 ప్రమోషన్లకు ఉత్తర్ ప్రదేశ్ వస్తే కలుస్తానని బన్నీ చెప్పడంతో అతడు చాలా సంతోషపడుతూ జుకేగా నై (తగ్గేదే లే) అంటూ పుష్ప స్టైల్ లో డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.