Allu Arjun: మొన్న సీఎం పేరు... ఇప్పుడు సుకుమార్ పేరు మర్చిపోయాడంటూ అల్లు అర్జున్ పై ట్రోలింగ్..

Allu Arjun: మొన్న సీఎం పేరు... ఇప్పుడు సుకుమార్ పేరు మర్చిపోయాడంటూ అల్లు అర్జున్ పై ట్రోలింగ్..

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ సాధించింది. దీంతో స్పీడ్ గా 1000 కోట్లు కలెక్షన్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప2 రికార్డులు క్రియేట్ చేసింది. 

అలాగే బాలీవుడ్ లో అత్యధికంగా రూ.400 కోట్లు (నెట్) కలెక్ట్ చేసింది. హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 టీమ్ నార్త్ ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి డిల్లీలో థాంక్స్ మీట్ నిర్వహించారు. 

ఇందులో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ హిందీలో పుష్ప 2 ని ఇంతపెద్ద హిట్ చేసినందుకు అభిమానులకి కృతజ్ఞతలు తెలిపాడు. పుష్ప 2 షూటింగ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేసిన టీమ్ అందరికీ థాంక్స్ చెప్పాడు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద హిట్ కావటానికి డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డి కారణమంటూ క్రెడిట్ మొత్తం ఆయనికి ఇచ్చాడు. అయితే సుకుమార్ పూర్తిపేరు బండిరెడ్డి సుకుమార్ కానీ అల్లు అర్జున్ బండి సుకుమార్ రెడ్డి అని పిలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ | మామల బాటలోనే బన్నీ..? అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై టీం క్లారిటీ

అలాగే ఆమధ్య తెలుగులో థాంక్స్ మీట్ నిర్వహించిన సమయంలో కూడా బన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయాడని దీంతో అక్కడున్నవారు చెప్పడంతో గుర్తు చేసుకుని చెప్పారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఈ థాంక్స్ మీట్స్ లో ఎదో ఒక కాంట్రవర్సిలో నిలుస్తున్నాడని ఇంకొందరు అంటున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని హారిక&హాసిని , గీత ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తివివరాలు తెలిసే అవకాశం ఉంది.