టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోకొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. అమీర్‌పేట జంక్షన్‌లో నిర్మిస్తోన్న మల్టీప్లెక్స్ లో అల్లు అర్జున్ పార్ట్నర్ గా ఉన్నాడు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్‌ని కొనుగోలు చేసి, దాని స్థానంలో మల్తిప్లెక్స్ ను నిర్మించారు. ఈ మల్తిప్లెక్స్ త్వరలోనే ప్రారంభంకానుంది.
ఈ కొత్త మల్టీప్లెక్స్‌లో మొదటి సినిమాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆదిపురుష్ ప్రదర్శితం కానుంది. జూన్16న 'ఆదిపురుష్'సినిమా రిలీజ్ కానుంది. దీంతో జూన్ 16న ఈ సినిమాతోనే ఈ కొత్త మల్టీప్లెక్స్ ను ప్రారంభించాలని ఫిక్స్ అయ్యాడట అల్లు అర్జున్. ఇక ఈ మల్టీప్లెక్స్‌కు AAA సినిమాస్ అంటే ఏషియన్ సత్యం అని పేరు పెట్టినట్టు సమాచారం.
Also Read : కత్రీనా, విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా సెట్ అవరు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
మరి అల్లు అర్జున్ థియేటర్ వ్యాపారంలో విజయవంతం కావాలని, AAA సినిమాస్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.