అల్లు అర్జున్(Allu Arjun) జాతీయ అవార్డు (National Award)తో తెలుగోడి సత్తా చాటబోతున్నారు. ఇవాళ (అక్టోబరు 17) సాయంత్రం ఢిల్లీలో జరగబోయే జాతీయ అవార్డుల కార్యక్రమంలో..రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా..బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని అందుకోబుతున్నాడు.
అల్లు అర్జున్ అండ్ అతని భార్య స్నేహా రెడ్డి తో కలిసి ఈవెంట్ లో పాల్గొంటుండగా..రెడ్ కార్పెట్‌పై తమదైన శైలిలో నడిచొస్తున్న ఫొటోస్, వీడియోస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయకరమైన వేషధారణతో అల్లు అర్జున్ బ్రౌన్ సల్వార్ వైట్ సూట్ ధరించి.. కళ్ళజోడు..సింపుల్ స్టైలిష్ లుక్ లో ఉండగా..అతని భార్య అల్లు స్నేహ రెడ్డి మట్టి గోధుమ రంగుతో కూడిన ట్రేడషనల్ లుక్ మెస్మరైజ్ చేస్తుంది. దీంతో ఈ జంటను చూసిన ఆడియన్స్.. సెలబ్రేటిస్ వావ్ అంటున్నారు.
- ALSO READ | ఓటీటీలోకి హార్రర్ మూవీ.. ఎప్పుడంటే?
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప' చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవమిది. ఈ మూవీలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నటన..ఆ స్వాగ్..డైలాగ్స్..సామాన్యం. ప్రజల్లో బాగా..గుర్తింపు పొందిన ఈ పాత్రను అందరూ స్వాగతించారు కనుకే అవార్డ్ దక్కిందని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.
#ScrollandPlay Exclusive:@alluarjun with wife #AlluSnehaReddy at National Film Awards ❤️#AlluArjun #AlluSnehaReddy #NationalFilmAwards #ScrollandPlay #Pushpa2TheRule pic.twitter.com/WV0O7uDdXx
— Scroll & Play (@scrollandplay) October 17, 2023