ప్రపంచమంతటా పుష్ప 2 (Pushpa2) ఫీవర్ పట్టుకుంది. ఇంకా ఈ సినిమా రిలీజ్కు (2024 డిసెంబర్ 5) నెలరోజులే టైం ఉండటంతో హంగామా మొదలైంది. వరల్డ్ వైడ్గా 11,500 థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 ఒవర్సీస్ అడ్వాన్స్ బుక్కింగ్స్ కూడా మొదలయ్యాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఇలా బుకింగ్స్ ఓపెన్ చేస్తే అలా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోవడం పక్కా అనేలా ఉంది ఐకాన్ అల్లు అర్జున్(Allu Arjun) ఫీవర్.
ఓవర్సీస్లో ప్రీ సేల్స్లో-600 లొకేషన్స్లో 2200 షోస్ కి: $250K ప్రీమియర్స్ ప్రీ సేల్స్ మొదలై రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప2. 'రికార్డుల కోసం నడిచే పుష్ప రూల్ బుక్ అయినప్పుడు ఎవరి పాలన అయిన డామినేట్ అవ్వడం పక్కా' అనేలా ఉంది.
USAలో అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్ సేల్స్::
తాజా అప్‌డేట్ ప్రకారం, నవంబర్ 2, 2024 నాటికి, పుష్ప 2 కొన్ని రాష్ట్రాలలో అత్యధికంగా 3,045 టిక్కెట్‌లను విక్రయించింది. గత శుక్రవారం నాటికి 1,800 టిక్కెట్ల విక్రయాలతో పోలిస్తే ఇది 71% ఎక్కువని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అంతేకాదు షోల సంఖ్య కూడా మరింత పెరిగుతుంది అని అంటున్నారు.
531 షోల నుండి, ప్రీమియర్ సేల్స్ మొదలవ్వగా ఇప్పుడు 1,522 షోలకు పెరిగింది. ఇలా USA లో అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు జోరందుకోవడం మేకర్స్కి హ్యాపీ ఫీలింగ్ ఇస్తోంది. ఇక అమ్ముడుపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్ సంఖ్య గంటగంటకు పెరుగుతూ వస్తోందనే విషయం గుర్తించుకోవాలి.
పుష్ప 2 బడ్జెట్ అండ్ బ్రేక్ ఈవెన్:
500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ.1085 కోట్లకి పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రాబట్టింది. దాంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో నిలిచింది. అంటే ఇది ఎంత పెద్ద టార్గెట్ అనేది ఆలోచిస్తేనే మైండ్ బ్లాక్ అవుతోంది. మరి పుష్ప2 తో అల్లు అర్జున్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
#Pushpa2TheRule is living up to its name with HIS RULE taking over in spectacular style! 💥💥
— Prathyangira Cinemas (@PrathyangiraUS) November 3, 2024
With MASSIVE PRE SALES at the box office we're already nearing 2,200+ shows! 🔥🔥#Pushpa2 #Pushpa2USA
pic.twitter.com/Skkin4R9dM