Pushpa 2: బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టిన పుష్ప 2 మూవీ.. 32 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

Pushpa 2: బాహుబలి 2 రికార్డును బద్దలుకొట్టిన పుష్ప 2 మూవీ.. 32 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప 2 (Pushpa 2)మూవీ బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్లో మంచి వసూళ్లే రాబడుతోంది. ఇప్పడు రూ.2వేలకోట్ల మార్క్ కు అతి దగ్గర్లో ఉంది. మరి ఆ మార్క్ను చేరుకుంటుందా లేదా అనేది వివరాలు చూద్దాం. 

లేటెస్ట్గా పుష్ప 2 మూవీ 32 రోజుల కలెక్షన్స్ను అనౌన్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. "పుష్ప 2 మూవీ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లతో హిట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 32 రోజుల్లో రూ.1831 కోట్ల గ్రాస్‌ను సాధించిందంటూ " మేకర్స్ వివరాలు వెల్లడించారు.

ఆల్ టైం రికార్డ్స్ చూసుకుంటే: బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 1788.06 కోట్లు. బాలీవుడ్ మూవీ దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.2000 కోట్లు. అంటే, నిన్నటివరకు దంగల్ తర్వాత అత్యధికి వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. ఇక ఇప్పుడు పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ.1831 చేరడంతో.. బాహుబలి 2 రికార్డ్స్ బీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. 

నిన్న ఆదివారం ఒక్కరోజే ( జనవరి 6న) పుష్ప 2కి ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.10కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. నెలరోజులు దాటినా కూడా కోట్లలో వసూళ్లు చేస్తుండటంతో త్వరలో రెండు వేల కోట్ల మార్కును చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఆ అంచనాలను క్రాస్ చేయాలంటే ఇంకా రూ. 169 కోట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే దాదాపు 2 వేల కోట్లు సాధించడం కష్టతరమే. ఎందుకంటే.. ఇన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద కేవలం పుష్ప 2 మాత్రమే ఉంది.ఇక ఇప్పుడు కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి.

ALSO READ | NTRNeel: డ్రాగన్ క్రేజీ అప్డేట్స్.. అంచనాలు పెంచుతున్న ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్

అయితే, తెలుగులో పుష్ప 2 మూవీ థియేట్రికల్ లాంగ్ రన్ ఎప్పుడో పూర్తి చేసుకుంది. హిందీలో కూడా దాదాపు కష్టమనే చెప్పుకోవాలి. ఇక మొత్తానికి రూ.1900 కోట్లు చేసే అవకాశం ఉంది. ఇకపోతే పుష్ప 2 మూవీ హిందీలో రూ.800కోట్ల నెట్ వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 2024 డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన పుష్ప 2 మూవీ ఇప్పటివరకు ఎన్నో అంచనాలు దాటేసింది.