పుష్ప 2@ రూ.1500 కోట్లు: అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న.. తొలి ఇండియన్ మూవీగా రికార్డ్

పుష్ప 2@ రూ.1500 కోట్లు: అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న.. తొలి ఇండియన్ మూవీగా రికార్డ్

ప్రస్తుతం ఇండియాలో పుష్ప 2 ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ విన్నా ఎక్కడ చుసిన ఎక్కువగా పుష్ప టాపిక్ నడుస్తుంది. కనీవినీ ఎరగని రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ మొత్తం ప్రపంచాన్నే షేక్ చేస్తుంది. ఇంతకముందున్న బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నిటినీ పుష్పరాజ్ తుడుచిపెట్టేస్తున్నాడు. 

పుష్ప 2 మూవీ 14 రోజుల్లోనే  ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా రూ.1,508 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. గతంలో ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘RRR’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది. అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. ముంబయి సర్క్యూట్‌లో రూ.200 కోట్లు (నెట్‌) సాధించిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన ‘పుష్ప 2’.ఇపుడు హిందీలో రూ.618.50 కోట్లు (నెట్‌) వసూలు చేసినట్లు పుష్ప టీమ్ ప్రకటించింది.

దాంతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రబంజనం సృష్టిస్తున్న పుష్ప 2.. ఇప్పటికే హిందీ బెల్ట్ లో షారుక్ ఖాన్ జవాన్ రికార్డ్ క్రాస్ చేసి అల్ టైమ్ హైయిస్ట్ గ్రాస్సింగ్ మూవీగా నిలిచింది. ఇంకా స్త్రీ 2 మూవీ అడుగు దూరంలో ఉంది. స్త్రీ 2 మూవీ లాంగ్ రన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.627 కోట్ల వరుకు వసూల్ చేయగా.. పుష్ప కేవలం 15 రోజుల్లోనే రూ.618 కోట్లు వసూల్ చేసి చరిత్ర సృష్టించాడు. ఇక రానున్న రెండ్రోజుల్లో వచ్చే కల్లెక్షన్స్ తో .. స్త్రీ 2 మూవీని కూడా పుష్ప 2 క్రాస్ చేసే అవకాశం ఉంది. 

ALSO READ : Today Releases Movies: నేడు (Dec 20న) థియేటర్లలోకి 4 సినిమాలు.. తెలుగు ప్రేక్షకులకి పండగే