అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్... ఫాస్ట్ గా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమాగా పుష్ప2..

అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్... ఫాస్ట్ గా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ సినిమాగా పుష్ప2..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2: ది రూల్ ఇండస్ట్రీలో రికార్డులు, సెన్షేషన్స్ క్రియేట్ చేస్తుంది. అల్లు అర్జున్ మాస్ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్, ఫ్యామిలీ సెంటిమెంట్, ఫహద్ ఫజిల్ విలనిజం వంటివి పుష్ప 2 కి భారీ విజయాన్ని కట్టబెట్టాయి. అయితే పుష్ప 2 వరల్డ్ వైడ్ గా దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాగా మంచి పాజిటివ్ టాక్ తో దోసుకుపోతోంది. అలాగే మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డ్ చేసింది.

ALSO READ | WildFirePushpa: పుష్ప 2 ఐదు రోజుల్లో రూ.922 కోట్లు.. కల్కి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అవుట్.. ఇప్పటివరకు నెట్ ఎంత?

అయితే ఈరోజు(సెప్టెంబర్ 11) మేకర్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ప్రకటించారు. ఇందులోభాగంగా 6 రోజుల్లోనే రూ.1002 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ సాధించినట్లు అధికారికంగా తెలిపారు. అలాగే 6 రోజుల్లోనే ఫాస్ట్ గా రూ.1002 కోట్లు సాధించిన తొలి ఇండియన్ సినిమాగా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా షేర్ చేశారు.  దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం నుంచి మల్టీప్లెక్స్ అలాగే సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరలు తగ్గించారు. దీంతో కలెక్షన్లు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. కానీ నార్త్ లో మాత్రం కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. కాగా నార్త్ లో కూడా  6 రోజుల్లోనే రూ.375 కోట్లు(నెట్) కలెక్ట్ చేసింది. రెండోవారాలోనే రూ.1200 కోట్లు అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.