10వ రోజు కూడా కలెక్షన్లు తగ్గేదేలా... రూ.1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప రాజ్

10వ రోజు కూడా కలెక్షన్లు తగ్గేదేలా...  రూ.1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప రాజ్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 05న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ప్రమయూఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, డైలాగులు ఇలా అన్ని ఆడియన్స్ ని కట్టి పడేశాయి. దీంతో పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన మొదటివారంలో 1000 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు గడుస్తున్నా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. అయితే మేకర్స్ ఇటీవలే 10వ రోజు కలెక్షన్స్ ప్రకటించారు. ఇందులోభాగంగా శనివారం రోజున రూ.100 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే 10వ రోజు రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి ఇండియన్ సినిమా రికార్డులు చేసినట్లు తెలిపారు.

ఇప్పటివరకూ 10 రోజుల్లో 1292 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన రెండో సినిమాగా రికార్డులు బ్రేక్ చేసింది. బాలీవుడ్ లో ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి. దీంతో మేకర్స్ తోపాటు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వారాంతానికి దాదాపుగా రూ.1500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ | SSMB28 Updates: మహేష్ బాబు కోసం బాలీవుడ్ హీరోయిన్ ని సెలక్ట్ చేసిన రాజమౌళి.. !