Pushpa2: పుష్ప గాడి తెలుగు వైల్డ్ ఫైర్ ఈవెంట్‌కి రంగం సిద్ధం.. ఎప్పుడు.. ఎక్కడంటే?

అల్లు అర్జున్ పుష్ప 2 ఈవెంట్ ఆదివారం నవంబర్ 25న చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో కిస్సిక్ సాంగ్ రిలీజ్ చేసి ఆడియన్స్కి మత్తెక్కించేశారు మేకర్స్. ఇటీవలే బీహార్ పాట్నాలో ఈవెంట్ జరిపి ట్రైలర్.. నిన్నటి చెన్నై ఈవెంట్లో సాంగ్.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్స్ ఇచ్చి అభిమానుల్లో అంచనాలు పెంచేశారు.

అయితే.. మరి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహించబోతున్నారనే విషయంపై ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప2 తెలుగు వైల్డ్ ఫైర్ ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మేకర్స్ పనులు స్టార్ట్ చేశారట. రానున్న ఈ రెండ్రోజుల్లో 'రామోజీ ఫిలిం సిటీ లేదా ఎల్బీ స్టేడియం' లో ఏదో ఒకటి కన్ఫమ్ చేయనున్నారట.

అన్నీ కుదిరితే Nov 29 అండ్ 30 తేదీలలో ఏదోకటి ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో పుష్ప 2 నుంచి సెకండ్ ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నట్లు టాక్  దాంతో ఈ పుష్పాగాడి మాస్ జాతర టాలీవుడ్ లో మోతమోగిపోవాల్సిందే అని టాక్.

అయితే, ఈ ఈవెంట్‌కి అన్ని ప్రాంతాల నుండి అభిమానులను టీమ్ పాస్‌ల ద్వారా ఆహ్వానిస్తుంది. కానీ, చివరి మూమెంట్లో దేవర మాదిరి ఈవెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయనే సందేహాలు మొదలయ్యాయి. మరి పుష్ప2 తెలుగు ఈవెంట్ పర్మిషన్ కోసం మేకర్స్ ట్రై చేస్తుండగా.. త్వరలో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా పుష్ప 2 మూవీ డిసెంబర్ 5, 2024న రిలీజ్ కానుంది.