Pushpa 2: పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డు.. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమాగా అత్యధిక థియేటర్లో రిలీజ్‌!

Pushpa 2: పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డు.. బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమాగా అత్యధిక థియేటర్లో రిలీజ్‌!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం 'పుష్ప-2' (Pushpa2TheRule). ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై అభిరుచి గల నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌.వైలు సుకుమార్‌ రైటింగ్స్ అసోసియేషన్‌తో నిర్మిస్తున్నారు.

రోజు రోజుకు పుష్ప-2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. విడుదలైన టీజర్‌, రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్‌ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల జరిగిన నేషనల్‌ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో సన్సేషనల్‌ న్యూస్‌ను వెల్లడించారు మేకర్స్‌. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్‌. ఇండియాలో 6500 స్ర్కీన్స్‌ల్లో, ఓవర్సీస్‌లో 5000 స్ర్కీన్స్‌ల్లో గ్రాండ్‌ విడుదలకు ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు నిర్మాతలు.

Also Read : తెలుగు బిగ్బాస్ షోకి రానున్న స్టార్ హీరో, హీరోయిన్

అయితే ఇది బిగ్గెస్ట్‌ రిలీజ్‌ ఇండియన్‌ సినిమాగా ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌. ఇక పుష్ప-2 బాక్సాఫీస్‌ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్‌ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంటున్నాయి ట్రేడ్‌ విశ్లేషకులు.