Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Pushpa 2 OTT: పుష్ప 2 ఓటీటీ అప్డేట్ .. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

పుష్ప 2: ది రూల్.. రిలీజై 49 రోజులు అవుతున్న బాక్సాఫీస్ ఫీవర్ తగ్గట్లేదు. ఇప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను సాధిస్తోంది. ఇటీవలే పుష్ప 2 రీలోడ్ వెర్షన్ తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్ రూ.1కోటి నుంచి 2కోట్ల మధ్య వసూళ్లని రాబడుతూ ముందుకెళ్తోంది. అయితే, ఈ క్రమంలో పుష్ప 2 ఓటీటీ ప్లాట్ఫామ్, స్ట్రీమింగ్ డేట్ వివరాలపై ప్రేక్షకుల్లో డిస్కషన్స్ మొదలయ్యాయి.

పుష్ప 2 ఓటీటీ:

పుష్ప 2 హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఏకంగా రూ.250 కోట్లకు స్ట్రీమింగ్ హక్కుల్ని కైవసం చేసుకుందని టాక్. అయితే, మైత్రి మేకర్స్ పుష్ప 2 (డిసెంబర్ 20న) ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను X లో వెల్లడించారు. 

'పుష్ప 2: ది రూల్ ఓటీటీ విడుదల గురించి పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ బిగ్గెస్ట్ పుష్ప2 సినిమాని పెద్ద స్క్రీన్‌లలో మాత్రమే ఆస్వాదించండి. ఇది 56 రోజుల వరకు ఏ OTTలో స్ట్రీమింగ్ ఉండదు!' అని తెలిపారు. అయితే, పుష్ప 2 థియేటర్లలో రిలీజై 56 రోజులు దగ్గర పడుతుండటంతో మళ్ళీ టాక్ మొదలైంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. పుష్ప 2 మూవీ ఈ నెల (జనవరి 29 లేదా 31న) ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ప్రస్తుతం థియేటర్స్లో యాడ్ చేసిన రీలోడ్ వెర్షన్తో స్ట్రీమింగ్కి రానుంది. త్వరలో పుష్ప 2 స్ట్రీమింగ్ వివరాలను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు.

పుష్ప 2 కలెక్షన్స్:

దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇండియాలో ఈ మూవీ రూ.1228.9 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. జనవరి 6 వరకు పుష్ప 2.. వరల్డ్ వైడ్ గా రూ.1832 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రి మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక అప్పటినుంచి ఎలాంటి వసూళ్ల అప్డేట్ పోస్టర్ విడుదల చేయలేదు. అయితే, సినిమా థియేటర్స్ లో ఇంకా రన్ అవుతుండటంతో కలెక్షన్స్ రూ.1900 కోట్ల గ్రాస్ వరకు చేరుకోవొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో పుష్ప 2 నిలిచింది.