Pushpa 2: పుష్ప 2 జపాన్ సీక్వెన్స్‌తో 20 నిమిషాల రీలోడ్ వెర్షన్.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

Pushpa 2: పుష్ప 2 జపాన్ సీక్వెన్స్‌తో 20 నిమిషాల రీలోడ్ వెర్షన్.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) లేటెస్ట్ వసూళ్ల సెన్సేషన్ మూవీ పుష్ప 2 (Pushpa 2). ఈ మూవీ రిలీజై 35 రోజులైనా కలెక్షన్స్ కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఏ ఈసినిమా చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో మేకర్స్ పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్టు మేకర్స్ పోస్ట్ చేశారు. 

"పుష్ప 2 మూవీలో 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో కూడిన రూల్ రీలోడెడ్ వెర్షన్ జనవరి 11 నుండి సినిమాల్లో ప్రదర్శించబడుతుంది. ది వైల్డ్‌ఫైర్ గెట్స్ ఎక్స్‌ట్రా ఫైరీ.. " అంటూ కొత్త పోస్టర్‌తో X వేదికగా మేకర్స్ ప్రకటించారు.

అయితే, ఈ సినిమా రన్ టైం ఇప్పటికే 3 గంటల 15 నిముషాలు ఉంది. ఇదే చాలా ఎక్కువ రన్ టైం. ఇక దీనికి తోడు మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించి తీసుకొస్తుండటం ఒక విధంగా విశేషం అని చెప్పాలి. ఎందుకంటే , సినిమా చూస్తున్న ఆడియన్స్ అల్లు అర్జున్ స్వాగ్ కి ఫిదా అవుతున్నారు కాబట్టే.. ఇప్పటికీ చూస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా సీన్స్ యాడ్ చేస్తుండటంతో ఆవేలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది. ఈ కొత్త వెర్షన్ జనవరి 11 నుంచి థియేటర్లలో అందుబాటులోకి రానుంది. 

రిలీజ్ చేసిన కొత్త పోస్టర్‌లో ఉన్న అల్లు అర్జున్ స్టిల్ జపాన్ సీక్వెన్స్‌లోనిది. ఇది ట్రైలర్‌లో కూడా ఉంది. కానీ థియేట్రికల్ వెర్షన్ నుండి తొలగించబడింది. అయితే, ఇపుడు యాడ్ చేస్తున్న 20 నిమిషాల కొత్త కంటెంట్‌లో ఉండొచ్చని విషయమే అర్ధమవుతుంది. అలాగే ఇతర ముఖ్యమైన సీన్స్ కూడా రావొచ్చని ఐకాన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం పుష్ప 2 మూవీ 33 రోజుల్లో రూ.1850 కోట్లకు చేరువైంది. ఇపుడు సంక్రాంతి సినిమాలు రిలీజ్ కానున్న సమయంలో పుష్ప 2 జోరు తగ్గిపోయింది. దీంతో మొత్తంలో మొత్తం రూ.1900 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి 20 నిమిషాల పుటిజ్ ఏం మార్చనుందో!