Pushpa2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ లో రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ దాదాపుగా 12500 స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో స్పెషల్, బెనిఫిట్ షోస్ కి పర్మిషన్స్ ఇచ్చారు. దీంతో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ చేశారు.
దీంతో రిలీజ్ కి ముందే పుష్ప 2 రికార్డులు మోత మోగిస్తుంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు కలెక్ష్ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయానికి సంబందించిన రికార్డ్స్ రప, రపా అంటూ పోస్టర్ కూడా షేర్ చేశారు. అయితే ఇందులో ఓవర్సీస్ లో కూడా పెద్దమొత్తంలో కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమా గా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే ఇప్పటివరకూ అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ సాధించిన చిత్రాల్లో బాహుబలి 2: ది కంక్లూజన్ (రూ.90 కోట్లు), కేజిఎఫ్ 2 (రూ.80 కోట్లు) సినిమాలు టాప్ లో ఉన్నాయి. ఈ రికార్డులని పుష్ప 2 దాదాపుగా 7 ఏళ్ళ తర్వాత బ్రేక్ చేసింది. దీంతో పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి రోజు దాదాపుగా రూ.300 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
#Pushpa2TheRule crosses the 100 CRORES mark with advance bookings 💥💥💥
— Pushpa (@PushpaMovie) December 3, 2024
THE BIGGEST INDIAN FILM is on a record breaking spree ❤🔥#RecordsRapaRapAA 🔥🔥#Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/vTBhiy18oB
ఇక పుష్ప 2 క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించగా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అనసూయ, రావు రమేష్, జగపతి బాబు, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. దీంతో తమిళ్, కన్నడ, హిందీ తదితర బాషలలో పుష్ప 2 కి మంచి క్రేజ్ ఉంది. టాక్ విషయంలో కూడా చిత్ర యూనిట్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.