Pushpa2 The Rule: బెంగళూరులో పుష్ప 2 టీమ్ కి షాకి ఇచ్చిన సర్కార్.. మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే..?

Pushpa2 The Rule: బెంగళూరులో పుష్ప 2 టీమ్ కి షాకి ఇచ్చిన సర్కార్..  మిడ్ నైట్ షోస్ క్యాన్సిల్.. ఎందుకంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 రిలీజ్ కి సిద్ధంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలు మొదలుకానున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో పుష్ప2 స్పెషల్, బెనిఫిట్ షోస్ కి అడ్డంకులు ఎదురవుతున్నాయి. అంతేగాకుండా బెనిఫిట్ షో టికెట్ ధరలు అధికంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పుష్ప 2 ప్రీమియర్ షోలను నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేశారు. 

ఈ పిటీషన్ లో ప్రీమియర్ షో టికెట్ ధర దాదాపుగా రూ.1000 కి పైగా ఉందని దీంతో లోకల్ సినిమాలపై ఈ ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అలాగే స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలకి పర్మిషన్స్ ఇవ్వడంవలన థియేటర్లు దొరకకపోవడంతోపాటూ స్థానిక సినిమాలకి ఆదరణ తగ్గుతుందని కాబట్టి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చెయ్యాలని కోరారు. దీంతో కర్ణాటక రాష్ట్ర గవర్నెమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది. 

ఈ క్రమంలో బెంగుళూరు జిల్లా కలెక్టర్ బెంగళూరులో మిడ్ నైట్ షోస్ ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పుష్ప ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప2 సినిమా చూడటానికి బెంగుళూరుకి వచ్చారు. దీంతో చివరి క్షణంలో షోలు క్యాన్సిల్ చెయ్యడంతో నిరాశకి గురవుతున్నారు. అయితే పుష్ప 2 బెనిఫిట్, స్పెషల్ షోలు క్యాన్సిల్ కావడంతో 05న ఉదయం 10:30 గంటల షోలు ప్రారంభం కానున్నాయి.