Pushpa2: రూ.1000కోట్లు దాటిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఆర్ఆర్ఆర్ కూడా వెనక్కి.. ఆ లెక్కలు చూస్తే షాక్

Pushpa2: రూ.1000కోట్లు దాటిన పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఆర్ఆర్ఆర్ కూడా వెనక్కి.. ఆ లెక్కలు చూస్తే షాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా వస్తున్న పుష్ప 2(Pushpa 2) క్రేజ్ రోజురోజుకి నెక్స్ట్ లెవల్ కి చేరుకుంటోంది. ఇండియన్ టాప్ స్టార్స్ సైతం టచ్ చేయాలనీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అది కూడా రిలీజ్కు ముందే. ఆ లిస్టులో మన స్టార్స్ దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆ రేంజ్లో బజ్ క్రియేట్ చేస్తోంది పుష్ప 2. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. 

పుష్ప 2 ప్రీ-రిలీజ్ బిజినెస్::

సుకుమార్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా పుష్ప 2 - ది రూల్ మూవీకి ట్రేడ్‌లో భారీ డిమాండ్ ఏర్పడింది. విడుదలకు ముందే పుష్ప 2 రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు ట్రేడ్ వర్గాల నుంచి టాక్.  

లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.600 కోట్లు పలికినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మరియు ఉత్తర భారతదేశంలో థియేట్రికల్ హక్కులు 375-400 కోట్లకు అమ్ముడయ్యాయట. మిగతా ఇండియా స్టేట్స్లో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.100 కోట్లకు చేరుకోగా.. ఓవర్సీస్ రైట్స్ బిజినెస్ దాదాపు రూ.125 కోట్లు మేరకు ఉందని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 600+ కోట్లు అని చెబుతున్నారు.

Also Read :  నయన్‌కి విఘ్నేశ్‌ పెద్ద అభిమాని

అలాగే రూ.65 కోట్లకు మ్యూజిక్ రైట్స్ ను మరియు రూ. 85 కోట్లకు టెలివిజన్ హక్కులను, ఇక రూ.275 కోట్లకు నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు తెలుస్తోంది. ఇక మొత్తానికి మొత్తంగా పుష్ప 2 - ది రూల్ యొక్క ప్రీ-రిలీజ్ థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ బిజినెస్ 1025+ కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే పుష్ప 2 ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్ టైమ్ బిజినెస్ అని చెప్పుకోవాలి. 

ఓవర్ ఆల్ బిజినెస్ లో సౌత్ నుండి రూ.900 కోట్లతో ఆర్ఆర్ఆర్ టాప్ లో ఉంది. ఇప్పుడు ఆ సినిమా రికార్డ్ బ్రేక్ చేసి రూ.1000 కోట్ల బిజినెస్ చేసిన మూవీగా పుష్ప 2 నిలిచిందని ట్రేడ్ నిపుణులు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి లాంటి దర్శకుడు లేకుండా ఈ రేంజ్ బిజినెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.. జస్ట్ అల్లు అర్జున్ థింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

  • Beta
Beta feature
  • Beta
Beta feature