Pushpa3: అల్లు అర్జున్ 'పుష్ప3’ కన్ఫమ్.. టైటిల్‌ ఏంటో తెలిస్తే ఐకాన్ ఫ్యాన్స్ రచ్చే!

Pushpa3: అల్లు అర్జున్ 'పుష్ప3’ కన్ఫమ్.. టైటిల్‌ ఏంటో తెలిస్తే ఐకాన్ ఫ్యాన్స్ రచ్చే!

ప్రస్తుతం ఇండియా సినీ ప్రేక్షకుల దృష్టి అంతా అల్లు అర్జున్ (Allu Arjun).. డైరెక్టర్ సుకుమార్ల పుష్ప యూనివర్స్ పైనే. పుష్ప పార్ట్ 1 క్రియేట్ చేసిన రికార్డ్స్తో పార్ట్2పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది పుష్ప2 ది రూల్ (Pushpa 2 The Rule). ఐకాన్ ఫ్యాన్స్ నిరీక్షణకు దాదాపు తెరపడింది! గురువారం డిసెంబర్ 5, 2024 న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో పుష్ప2 పై  వస్తోన్న అసాధారణమైన హైప్కి ఇండియా సినీ క్రిటిక్స్ అంత కంగుతింటున్నారు. ఇండియాలో మొదలైన అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే రూ.100 కోట్ల కలెక్షన్స్ కు దగ్గరగా ఉంది. బుక్‌ మై షో, పేటీయంలో ఈ సినిమా చూడటానికి 3 మిలియన్లకి పైగా జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:-దేశం మొత్తంలో పుష్ప ఒక్కటే రిలీజ్..

ఈ క్రమంలోనే పుష్ప యూనివర్స్ లో పార్ట్ 3 కూడా ఉండబోతుందనే హింట్ ఇచ్చేసారు మేకర్స్. పుష్ప 3'కూడా తెరకెక్కుతున్నట్లు సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి వీడియో రిలీజ్ చేశారు. "యో గైస్ బ్రేస్ అప్ ఫర్ ది రైడ్... సీట్ బెల్ట్ బాంధో #Pushpa2TheRule aaa re le (sic)" అని క్యాప్షన్ ఇచ్చారు.

అలాగే ఆయన తన టీమ్‌తో కలిసి దిగిన ఫొటో వెనుక ‘పుష్ప3’ టైటిల్‌ ఉంది. అందులో ‘పుష్ప3: ది ర్యాంపేజ్‌’ (Pushpa3: The Rampage) అని ఉండటంతో పార్ట్‌-2 చివరిలో మూడో భాగానికి సంబంధించిన టైటిల్ ఉండడటంతో కన్ఫర్మ్ అయిపొయింది.

అంతేకాకుండా.. సుకుమార్ విజయ్ కాంబోలో ఓ సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ 2022లో విజయ్ దేవరకొండ చేసిన పోస్ట్‌ను వెలికితీసి మరి పుష్ప 3 టైటిల్ ని పట్టుకున్నారు.

హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ సుకుమార్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, "హ్యాపీ బర్త్‌డే @అర్యసుక్కు సార్ - మీకు జన్మదిన శుభాకాంక్షలు.. మీతో సినిమా ప్రారంభించడానికి నేను వేచి ఉండలేను.  పుష్ప- ది రాంపేజ్" అంటూ పోస్ట్ చేశారు. 

పుష్ప పార్ట్ 1- ది రైస్
పుష్ప పార్ట్ 2- ది రూల్
పుష్ప పార్ట్ 3- ది రాంపేజ్ అంటూ వివరంగా పోస్ట్ చేశారు దేవరకొండ. 

అలాగే ‘పార్ట్‌3’ ఉంటుందని బెర్లిన్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా అల్లు అర్జున్‌ కూడా స్పష్టం చేశారు. మూడేళ్ల తర్వాతే ‘పార్ట్‌3’కి అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఇటు సుకుమార్‌, అటు అల్లు అర్జున్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉన్నాయి. మరి ఈ సిక్వెల్ ను ఎప్పుడు తెరకెక్కిస్తారో రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందేమో చూడాలి.