
పుష్ప 3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. లేటెస్ట్గా పుష్ప ఫ్రాంఛైజ్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ కచ్చితంగా పుష్ఫ 3 లో నటిస్తారని నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.
"కచ్చితంగా పుష్ఫ 3 ది ర్యాంపేజ్ తీస్తాం. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ చేస్తారు. ఇక ఆ రెండు సినిమాల షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి, కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది. పుష్ప 3 రాబోయే రెండున్నర ఏళ్లలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మేం దాన్ని మూడున్నరేళ్లలో అంటే, 2028 నాటికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈసారి ఎక్కువ సమయం తీసుకోమని" నిర్మాత రవి శంకర్ వెల్లడించారు.
అలాగే 'డైరెక్టర్ సుకుమార్ తన తర్వాతి సినిమా రామ్ చరణ్ తో తీయనున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యేసరికి, పుష్ప 3 స్టోరీ రాయడానికి తప్పకుండ రెండున్నర ఏళ్ల టైం పడుతుంది. కాబట్టి అన్ని కలుపుకుని పుష్ప 3 ఓ మూడున్నర ఏళ్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని' నిర్మాత రవి శంకర్ తెలిపారు. దాంతో, ఇపుడు పుష్ప 3 న్యూస్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ మారింది. ఇకపోతే, మూడో పార్ట్‌కు 'పుష్ప ది రాంపేజ్' అనే టైటిల్‌ను ఫిక్స్‌చేశారు మేకర్స్.
ఇప్పటివరకు పుష్ప 3 సినిమాపై డైరెక్టర్ సుకుమార్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అల్లు అర్జున్ సైతం తన నుంచి రాబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో నిర్మాత రవి శంకర్ ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్, పుష్ప రాజ్ ఫ్యాన్స్లో కొత్త జోష్ నింపుతుంది. ఎందుకంటే, పుష్ప రాజ్గా ఫ్యాన్స్లో ఓ చెరగని యాటిట్యూడ్ సొంతం చేసుకున్నాడు బన్నీ. దాంతో పుష్ప 3 అప్డేట్పై ఎదురుచూపు నెలకొంది.
ఇకపోతే, దాదాపు రూ.400-500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప 2 మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.1871కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలోరూ.1228.9 కోట్లకి పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం పుష్ప 2 పాన్ ఇండియా భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.