ప్రస్తుతం ఇండియా నుండి వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో పుష్ప2(Pushpa2) ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun) హీరోగా, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తన్నారు. ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన వీడియోకి ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
అయితే తాజా పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. పుష్ప ది రూల్ సినిమాను 2024 మార్చి 22న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. అంతేకాదు ఈ సినిమా కోసం లాంగ్ వీకెండ్, హాలీడేస్ సెట్ అయ్యేలా ఈ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారట. మార్చ్ 22 సినిమా రిలీజ్.. మార్చి 23, 24 వీకెండ్.. 25న హోళీ.. మధ్యలో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఉండగా.. మళ్ళీ మార్చి 29న గుడ్‌ఫ్రైడే ఆ తరువాత మళ్ళీ వీకెండ్. ఇలా వారం రోజుల పాటు పుష్ప సినిమాకు ఎదురులేని విధంగా ప్లాన్ చేసుకున్నారట మేకర్స్. ఈ హాలీడేస్ కలిసొచ్చి, సినిమాకు జస్ట్ పాజిటీవ్ టాక్ వస్తే చాలు.. పుష్ప2 వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.