Pushpa 2: The Rule tickets: దేశవ్యాప్తంగా పుష్ప2 మూవీ పలు రికార్డులు బద్ధలు కొడుతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప2 మూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించారు. ఎల్లుండే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్స్ స్టార్ట్ అవగా భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఢిల్లీ, ముంబై, పాట్నా, కోల్ కతా, బెంగళూరు, హైదరాబాద్ లో టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి. నగరాల్లో పుష్ప2 మూవీ టికెట్ల ధరలు రూ. 1800 ఉన్నప్పుటికీ వాటిని కేవలం రూ. 100 కే సొంతం చేసుకునే అవకాశం ఉంది.
పేటీఎమ్ ద్వారా మీకు కావల్సిన థియేటర్ లో యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రెండు టికెట్లు బుక్ చేసుకుంటే స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ కింద ఫ్రీగా టికెట్లు పొందొచ్చు. బుక్ మై షో యాప్ ద్వారా, వైబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి ట్రాన్షాక్షన్స్ చేస్తే 50 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇక పీవీఆర్ యాప్ ద్వారా, వైబ్ సైట్ ద్వారా బుక్ చేసుకునేవారు తక్కువ రేట్లకే టికెట్లు పొందొచ్చు.
ALSO READ : అల్లు అర్జున్ బాహుబలి కాదు... మెగాబలి అంటూ ఆర్జీవీ సంచలన ట్వీట్..
ఢిల్లీ, ముంబైలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 100కే టికెట్లు దొరుకుతున్నాయి. జొమాటోతో లింక్ అయిన డిస్ట్రిక్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే మూవీ టికెట్లపై కొన్ని స్పెషల్ డీల్స్ ఉన్నారు. రూ. 999, అంతకంటే ఎక్కువ మొత్తంలో బ్లింక్ ఇట్ ద్వారా ఆర్డర్ చేస్తే మీరు తప్పకుండా తక్కువ ధరకే పుష్ప2 టికెట్లు పొందేందుకు రూ. 200 ఓచర్ పొందొచ్చు.