సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ ఎమోషనల్.. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

సంధ్య థియేటర్ ఘటన: అల్లు అర్జున్ ఎమోషనల్.. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్‎లోని సంధ్య థియేటర్‎లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తొక్కిసలాటలో గాయపడిన 11 ఏండ్ల శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఈ సంఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.

ఇందులో భాగంగా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత చాలా బాధ కలిగిందని అన్నాడు. అలాగే ఈ సంఘటన తర్వాత సెలెబ్రేషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొనలేకపోయామని తెలిపాడు. ఐతే లాస్ట్ 20 ఏళ్లుగా సంధ్య థియేటర్ లో సినిమాలు చూడటానికి వెళ్తున్నామని కానీ ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నాడు. మృతురాలి కుటుంబానికి తన తరఫునుంచి అలాగే పుష్ప సినిమా యూనిట్ తరఫునుంచి ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. 

Also Read:- టాలీవుడ్ లో పుష్ప 2 రికార్డుల ఊచకోత.. ఆ సినిమాల రికార్డులన్ని బ్రేక్..

ఇక ఏం చేసినా జరిగినదానిని మార్చలేమని కానీ రేవతి కుటుంబానికి అండగా నిలిచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగా 25 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించాడు. అలాగే బాలుడి ట్రీట్మెంట్ కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపాడు. మేం కష్టపడి సినిమాలు తీసేది మీరు ఎంజాయ్ చెయ్యడానికేనని కాబట్టి థియేటర్ కి జాగ్రత్తగా వెళ్లి సినిమా చూసి ఇంటికి వెళ్లాలని ఆడియన్స్ ని కోరాడు.