భారతీయ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉండగా.. అందులో తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర కలిగి ఉండటం మన ప్రత్యేకత. మన టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్స్ వచ్చారు. మరెందరో తమ స్థానాలను ఇండస్ట్రీలో పదిల పరుచుకున్నారు. కానీ ఏ నటుడికి ఉత్తమ జాతీయ అవార్డ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కట్ చేస్తే..ఇప్పుడు ఢిల్లీ మనవైపు తిరిగి చూసేలా..అల్లు అర్జున్(Allu Arjun) తన సత్తా చాటారు. ఇవాళ (అక్టోబరు 17) సాయంత్రం ఢిల్లీలో జరగిన జాతీయ అవార్డుల కార్యక్రమంలో..రాష్టపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) చేతుల మీదుగా..బన్నీ జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని అందుకున్నాడు. దీంతో తెలుగు లోగిళ్లలోకి తొలిసారి జాతీయ అవార్డు(National Film Award)గెలుచుకున్న యాక్టర్ గా అల్లు అర్జున్ నిలిచాడు.
A MONUMENTAL MOMENT FOR TELUGU CINEMA ❤️?❤️?
— Mythri Movie Makers (@MythriOfficial) October 17, 2023
Icon Star @alluarjun receives the 'Best Actor' Award at the '69th National Film Awards' Ceremony for #PushpaTheRise ?
Becomes the FIRST TELUGU ACTOR to receive the prestigious award.#Pushpa @iamRashmika #FahadhFaasil @aryasukku… pic.twitter.com/ZROZQne9nS
సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అల్లు అర్జున్ కు దక్కిన అరుదైన గౌరవమిది. ఈ మూవీలో గంధపు చెక్కల స్మగ్లర్ గా బన్ని నటన..ఆ స్వాగ్..డైలాగ్స్..సామాన్యం. ప్రజల్లో బాగా..గుర్తింపు పొందిన ఈ పాత్రను అందరూ స్వాగతించారు కనుకే అవార్డ్ దక్కిందని సినీ క్రిటిక్స్ మాట్లాడుకుంటున్నారు.
మొన్నటి వరకు మన దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఏ ఒక్క యాక్టర్ కు సరైన గుర్తింపు రాలేదు. అంతేందుకు..ఒకప్పుడు సినిమా అంటే..కేవలం హిందీ సినీ పరిశ్రమ అని మాత్రమే ఐడెంటిటీ కలిగి ఉండేది. ఇదే విషయాన్ని, మెగాస్టార్ చిరంజీవి ఒక వేదికపై మాట్లాడుతూ..తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు అనే దాని కంటే ఆవేదన చెందారని చెప్పొచ్చు.
మన తెలుగు ఇండస్ట్రీలో..భారతదేశం గర్వించదగే గొప్ప నటులున్నారు. రామారావు, నాగేశ్వరావు, ఎస్వీ రంగారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు..ఇలా చెప్పుకుంటే పోతే..దశాబ్దానికి ఒక పది మంది స్టార్స్ గా ఎదిగి..గుర్తింపు పొందారు. కానీ ఎవ్వరికీ ఉత్తమ జాతీయ అవార్డ్ దక్కలేదు. కనీసం మన స్టార్స్ కి ఢిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని చిరంజీవి తెలిపారు. వారి చిత్రపటాల్ని కనీసమాత్రంగా అయినా ఢిల్లీ సినిమా లైబ్రరీలో కూడా ఉంచలేదని అన్నారు
TFI PRIDE ALLUARJUN
— Manobala Vijayabalan (@ManobalaV) October 17, 2023
Huge CONGRATULATIONS to #AlluArjun for winning the prestigious National Award for the film #Pushpa.
Allu Arjun becomes the FIRST ever actor from TFI to win the #NationalAward.
The expectations for #Pushpa2TheRule has… pic.twitter.com/iNFLwiMZw5