అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అతను అరెస్ట్ కావడం..రిమాండ్ విధించడం.. బెయిల్‌పై విడుదల అవ్వడం అన్నీ ఒక్కరోజులోనే జరిగిపోయాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అతని విడుదలకు మార్గం సుగమైంది. శనివారం (డిసెంబర్ 14) ఉదయం 6:30 గంటల సమయంలో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకొచ్చారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ ని చంచల్ గూడ వెనుక గేటు నుంచి పంపించారు. దీంతో బన్నీ తన అనుచరులతో కలసి కారులో ఇంటికి బయల్దేరి వెళ్ళిపోయాడు.
మధ్యంతర బెయిల్..
అల్లు అర్జున్ తరుపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ విచారణ సంధర్భంగా తెలంగాణ హైకోర్టు నటుడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన 105(B), 118 సెక్షన్లు వర్తించవని విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరులకు వర్తించే మినహాయింపులను అల్లు అర్జున్‌కు నిరాకరించలేమని, ఆయనకు జీవించే హక్కు ఉన్నదని పేర్కొంది. రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తుపై అతన్ని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.
Also Read : అరెస్ట్ అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు
అర్ణబ్ గోస్వామి vs మహారాష్ట్ర ప్రభుత్వ కేసులో బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది.అంతుకుముందు తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.