Allu Arjun: ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అలా చేస్తే చర్యలు తీసుకుంటా...

Allu Arjun: ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ రిక్వెస్ట్.. అలా చేస్తే చర్యలు తీసుకుంటా...

కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వరుస వివాదాల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా అల్లు అర్జున్ అరెస్టయి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు కోర్టు విచారణలో ఉన్నప్పటికీ కొందరు ఉన్నవి లేనివి ప్రచారం చేస్తున్నారు. దీంతో బన్నీ సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించాడు. 

ఇందులో భాగంగా "నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు వేయవద్దని విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ID, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు వేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయి. నెగెటివ్ పోస్టులు వేస్తున్న వారికి దూరంగా వుండాలని నా ఫ్యాన్స్ కు సూచిస్తున్నాను." అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

ALSO READ | ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రీల్స్ కట్ చేస్తాం: పుష్ప 2 ఘటనపై ఏసీపీ ఫైర్

ఈ విషయం ఇలా ఉండగా అల్లు అర్జున్ డిసెంబర్ 4న బుధవారం రాత్రి 09:30 కి ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లిన సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో అల్లు అర్జున్ పై అలాగే మరింతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. అల్లు అర్జున్ కారణంగానే రేవతి మృతి చెందిందని కొందరు సోషల్ మీడియాలో డిబేబెట్లు పెడుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ వార్స్, నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి.