ఇకపై ఫాస్ట్‌‌‌‌గా సినిమాలు చేస్తా: అల్లు అర్జున్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2 ది రూల్’ మరో వారంలో (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా భారీ స్కేల్‌‌‌‌లో రిలీజ్ అవుతుండటంపై  అన్నిచోట్లా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్‌‌‌‌లోనూ వేగం పెంచి ఇప్పటికే పాట్నా, చెన్నైలో ఈవెంట్‌‌‌‌లు నిర్వహించగా అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కేరళలోని కొచ్చిలో ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. కేరళలో మల్లు అర్జున్‌‌‌‌గా అత్యధిక అభిమానులు ఉన్న తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌‌‌‌కు అక్కడ గ్రాండ్ వెల్‌‌‌‌కమ్ దక్కింది. 

ఈ వేడుకలో  అల్లు అర్జున్‌‌‌‌ మాట్లాడుతూ ‘గత 20 ఏండ్ల నుంచి మీరు నాపై ప్రేమ చూపిస్తున్నారు. ఈ సినిమా నా కెరీర్‌‌‌‌లో చాలా ప్రత్యేకం. ఇందులో  మలయాళ నటుడు ఫహాద్‌‌‌‌ ఫాజిల్‌‌‌‌తో పనిచేయడం ఆనందంగా ఉంది.  ఆయన నటన చూసి మీరంతా గర్వపడతారు. నా సినిమా కోసం  మూడేళ్లుగా వెయిట్‌‌‌‌ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తప్పకుండా ఇక నుంచి తొందరగా సినిమాలు చేస్తాను’ అని చెప్పాడు. ఈ సినిమాలో ప్రతి బిట్‌‌‌‌ను అందరూ ఎంజాయ్‌‌‌‌ చేస్తారని చెప్పింది రష్మిక మందన్నా.  అల్లు అర్జున్ ఫ్యాన్స్‌‌‌‌కు ఇది పండగలాంటి సినిమా అని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్  అన్నారు.