‘ఆ పక్కా నాదే .. ఈ పక్కా నాదే .. తలపైన ఆకాశం ముక్కా నాదే.. నను మించి ఎదిగేటోడు ఇంకోడు ఉన్నాడు చూడు.. ఎవడంటే అది రేపటి నేనే’ అంటున్నాడు పుష్పరాజ్. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేసిన టీమ్, నాలుగో పాటని నిన్న రిలీజ్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్‌కి.. ‘సేతిలోన గొడ్డలట.. సేసిందే యుద్ధమట.. సేయందే సంధి అట’ అంటూ సింపుల్ లైన్స్‌తో బన్నీ క్యారెక్టర్ కళ్లకు కట్టేలా లిరిక్స్ రాశారు చంద్రబోస్. నకాష్ అజీజ్ పాడాడు. ‘ఎవడ్రా ఎవడ్రా నువ్వు అంటే ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను.. మట్టిని నేను, నను తొక్కితే ఇటుకవుతాను.. రాయిని నేను, గాయం కానీ చేశారంటే ఖాయంగా దేవుడిని అవుతాను’ లాంటి పదాలు ఆకట్టుకున్నాయి. ప్రేమ్ రక్షిత్, గణేశ్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు బన్నీ. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సమంత స్పెషల్ సాంగ్ చేస్తోంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘పుష్ప: ది రైజ్’ పేరుతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న విడుదల కానుంది.
చేతిలోన గొడ్డలట.. చేసిందే యుద్ధమట
- టాకీస్
- November 20, 2021
మరిన్ని వార్తలు
-
కారు రేసింగ్‌లో హీరో అజిత్‌కు ప్రమాదం.. 180 కిలోమీటర్ల స్పీడ్ తో గోడను ఢీకొట్టింది..!
-
Honey Rose: నటి హనీ రోజ్పై అసభ్యకరమైన వ్యాఖ్యలు.. 30 మందిపై కేసులు.. ఒకరు అరెస్ట్
-
Fact Check: షారుఖ్ ఖాన్ భార్య మతం మార్చుకుందా..! అసలేం జరిగింది..?
-
SankranthikiVasthunam: బుక్ మై షోలో వెంకీ మామ ఫ్యాన్స్ అరాచకం.. సంక్రాంతికి వస్తున్నాం కోసం తెగ ఇంట్రెస్ట్
లేటెస్ట్
- సుప్రీం కోర్టుకు వెళ్లినా KTR తప్పించుకోలేడు: మహేష్ గౌడ్
- షేక్ హసీనాకు మరో షాక్.. పాస్ పోర్టు రద్దు చేసిన బంగ్లా సర్కార్
- పండుగ వేళన పొంచి ఉన్న హాలిడే హార్ట్ సిండ్రోమ్.. కార్డియాక్ అరెస్ట్ రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
- వారి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన టీటీడీ
- బతుకమ్మకుంట ప్రభుత్వానిదే.. హైడ్రాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు
- తెలంగాణ హైకోర్టు సీజే బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు
- కిషన్ రెడ్డి, బండి సంజయ్.. కార్యకర్తలను రెచ్చగొడుతున్నరు: జగ్గారెడ్డి
- ప్రయాణికులకు సంక్రాంతి ఆఫర్: టికెట్‌పై ఆర్టీసీ10 శాతం డిస్కౌంట్
- ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా.. డైరీ క్వీన్ బంపర్ ఆఫర్
- హైదరాబాద్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు
Most Read News
- బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాములు గోల్డ్ రేటు ఇలా ఉంది..
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లటి కబురు.. HCL ఉద్యోగులు పండగ చేస్కోండి..
- OTT Crime Thriller: ఓటీటీలోకి లేటెస్ట్ సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Oscars 2025: ‘ఆస్కార్’ బరిలో నిలిచిన ‘కంగువ’.. షార్ట్ లిస్ట్‌లో ఉన్న మన సినిమాలివే..!
- ముక్కోటి ఏకాదశి ( జనవరి 10)న .. ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా....
- ప్రీ లాంచ్ మోసం : రూ. 70 కోట్లు ముంచిన హైదరాబాద్ క్రితికా ఇన్ ఫ్రా డెవలపర్స్
- వందేళ్ల బ్రిడ్జిపై రాకపోకలు బంద్
- Celebrity Divorce: మళ్లీ విడాకులా.. నాలుగో భర్తకు కూడా గుడ్ బై చెప్పేసిన హీరోయిన్
- భర్త, ఆరుగురు పిల్లలను వదిలేసి బిచ్చగాడితో వెళ్లిపోయిన మహిళ
- హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?