వీడియో వైరల్: అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. బన్నీ రియాక్షన్కు నెటిజన్లు ఫిదా

వీడియో వైరల్: అల్లు అర్జున్ ఇంటి వద్ద ఫ్యాన్స్ హంగామా.. బన్నీ రియాక్షన్కు నెటిజన్లు ఫిదా

నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ (Allu Arjun) తన 43వ పుట్టినరోజు ఏప్రిల్ 8న ఇంట్లోనే జరుపుకున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తన ఇంటి బయట పూర్తి స్థాయి పండుగలా మారింది.

అల్లు అర్జున్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి తన ఇంటి బయట వందల మంది చేరుకున్న వీడియో ఒకటి బయటకి వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంది. క్లాసిక్ తెల్లటి టీ-షర్టు, బూడిద రంగు ప్యాంటు, నల్లటి సన్ గ్లాసెస్ ధరించి స్టైలిష్‌గా కనిపించాడు.

ఈ వీడియోలో స్టైలిష్ స్టార్‌ను కలవడానికి జనం విపరీతంగా ఎగబడుతున్నారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమకి అల్లు అర్జున్ ఇంటి లోపల నుంచే ప్రతిస్పందించాడు. గేట్ లోపల నుంచే చేతులు ఊపుతూ, నవ్వుతూ, వారికి కరచాలనం చేసి పలకరించాడు.

బన్నీ ఇచ్చిన రెస్పాన్స్ అక్కడ ఫ్యాన్స్ కళ్ళల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటి బయట ఫ్యాన్స్ కేకలతో ఉర్రూతలూగించారు. ఇపుడీ ఈ వీడియోతో పాటు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ తన అభిమానుల ప్రేమకి ఇచ్చిన రియాక్షన్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వేడుకలు కేవలం హైదరాబాద్ వీధులకే పరిమితం కాలేదు. ఇండస్ట్రీ అంతటా పుట్టినరోజు పోస్ట్‌లతో సోషల్ మీడియా హోరెత్తింది. 

పుష్ప, పుష్ప 2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్. తమ అభిమాన నటుడి పుట్టినరోజు సందర్భంగా.. ఎలాగైనా ఇంటికి వెళ్లి విష్ చేయాలని అభిమానులు అనుకుంటారు. దానిలో భాగంగా ప్రతి ఏడాది ఇంటికి వచ్చి తమ సంబరాన్ని పండుగలా చేసుకుంటూ వస్తున్నారు.  

AA22 మూవీ అప్డేట్:

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్- అట్లీ సినిమా అప్డేట్ ఇచ్చేసారు. నిర్మాణ దిగ్గజం సన్ పిక్చర్స్ ఈ సినిమాని (AA 22) నిర్మిస్తోంది.ఈ మేరకు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

అమెరికా లాస్ ఏంజిల్స్ సిటీలోని ప్రముఖ లోలా వీఎఫ్‍ఎక్స్ సంస్థ కార్యాలయంలో ఈ వీడియోను మూవీ టీమ్ షూట్ చేసింది. అల్లు అర్జున్, అట్లీ ఈ స్టూడియోలోకి వెళ్లి టెక్నిషియన్లతో మాట్లాడి, VFX పనులను పరిశీలించారు. అల్లు అర్జున్‍కు వీఎఫ్‍ఎక్స్ టెస్ట్ , 360 డిగ్రీ 3జీ స్కానింగ్ జరిగింది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.