అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు..ఐకాన్ స్టార్ నుంచి ఇప్పుడు నేషనల్ బెస్ట్ యాక్టర్ వరకు ..మనోడి రేంజ్ మాములూగా పెరగలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్.. పుష్ప కు ముందు..పుష్పకు తర్వాత అని చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ఒక్క సినిమాతో అల్లు అర్జున్ నిజం దేశముదురు అయ్యాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి వంటి మేటి స్టార్లకు సాధ్యం కానీ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇదే జోష్ లో పుష్ప 2 సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేస్తున్నాడు.
అల్లు అర్జున్ డే టూర్ ..
జనరల్గా బన్నీకి ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే అల్లు అర్జున్ ఉదయం లేచినప్పటి నుంచి..సాయంత్ర వరకు ఏం చేస్తాడు. అతని దిన చర్య ఎలా ఉంటుంది. సినిమా షూటింగ్స్ లో ఎలా ఉంటాడని తెలుసుకోవడానికి ప్రతీ ఫ్యాన్ ఆరాటపడతాడు. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ ఓ సర్ ప్రైజ్ వీడియోను పంచుకున్నాడు. ఓ రోజులో తను ఏం చేస్తాడో ఈ వీడియోలో క్లియర్ గా వివరించాడు బన్నీ.
ALSO READ :ఏక్తాకపూర్కు టెలివిజన్ రంగంలో.. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్
వీడియోలో ఏముందంటే..
రోజు ప్రారంభం నుంచి సాయంత్రం వరకు తను ఏం చేస్తాడో ఈ వీడియోలో అల్లు అర్జున్ చూపించాడు. పొద్దున లేవగానే తన ఇంటి ఆవరణలోని గార్డెన్ లో యోగ చేస్తాడు. తన గార్డెన్ లోని చెట్ల మధ్య హాయిగా వాకింగ్ చేస్తాడు. ఆ తర్వాత కాఫీ తాగుతాడు. ఫ్రెషప్ అయి..షూటింగ్ కు బయలు దేరుతాడు. మధ్యలో కార్లోనే తన పిల్లలతో వీడియో కాల్ మాట్లాడతాడు. సెట్స్ వెళ్లాక..ఫ్యాన్స్ ను పలుకరించడం దగ్గర నుంచి షూటింగ్ సెట్ లొకేషన్స్, హీరో క్యాస్టూమ్స్, కేరవాన్, ప్రాపర్టీస్ అన్నింటిని చూపించాడు. డైరెక్టర్ సుకుమార్ తో తనకు 20 ఏళ్ల అనుబంధం అని... ఇది తనకు 20వ సినిమా అని బన్నీ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి..జాతీయ అవార్డును అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు పుష్ప 2తో కూడా మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ పుష్ప 2పై అంచనాలు ఓ రేంజ్లో పెంచేశాయి. ఇందులో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందాన హీరోయిన్. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.