Thandel ప్రీ రిలీజ్‌ ఈవెంట్కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..

Thandel ప్రీ రిలీజ్‌ ఈవెంట్కు వెళ్లని Allu Arjun.. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్.. రీజన్ ఇదే..

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వెళతాడని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ‘తండేల్’ సినిమా టీం కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగా చీఫ్ గెస్ట్లుగా వస్తున్నట్లు ప్రచారం చేసింది. కానీ.. చివరి నిమిషంలో అల్లు అర్జున్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ అనే బాలుడు ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. సొంత కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో బెడ్పై పడి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లడం ఏమాత్రం భావ్యం కాదని భావించిన అల్లు అర్జున్ ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక విధంగా చూసుకుంటే ‘తండేల్’ అల్లు అర్జున్ సొంత సినిమా.

గీతా ఆర్ట్స్ బ్యానర్లో తనకు అత్యంత సన్నిహితుడైన, గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో నిర్మాతగా ఎదిగిన బన్నీ వాసు నిర్మాతగా ‘తండేల్’ సినిమా తెరకెక్కింది. అయినప్పటికీ జరిగిన విషాదం నుంచి శ్రీతేజ్ ఇంకా బయటపడకపోవడం, రెండు నెలల నుంచి ఆసుపత్రిలోనే ఉండటంతో అల్లు అర్జున్ ఏ ఫంక్షన్స్ కు ఇప్పట్లో వెళ్లడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ వెళ్లలేదు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపైనే ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ పెట్టినట్టు బన్నీ వాసు చెప్పాడు. ఆదివారం మధ్యాహ్నం కూడా అల్లు అర్జున్ తరపున బన్నీ వాసు కిమ్స్ హాస్పిటల్కు వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించాడు. పిల్లాడి కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే శ్రీతేజ్ను విదేశాలకు కూడా తీసుకెళ్లి చికిత్స అందించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ALSO READ | మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని రామ్ చరణ్ చేస్తున్నాడా..?

‘తండేల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సందీప్ రెడ్డి వంగా వెళ్లాడు. అల్లు అర్జున్ వెళ్లకపోయినప్పటికీ యాంకర్ సుమతో స్టెప్పులేస్తూ అల్లు అరవింద్ ఈవెంట్లో జోష్ నింపాడు. ఫిబ్రవరి 7, 2025న ‘తండేల్’ సినిమా విడుదల కాబోతోంది. ‘కార్తికేయ2’తో బంపర్ హిట్ కొట్టిన చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దేవీశ్రీ ప్రసాద్ బాణీలు ఇప్పటికే విశేష ఆదరణ పొందాయి. సాయిపల్లవి, చైతూ జంటగా నటించిన ఈ ‘తండేల్’ సినిమా పాకిస్థాన్ జైళ్లలో మగ్గిపోయి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని స్వదేశానికి చేరుకున్న కొందరు శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కింది.