Allu: తాతా – మనువడి అల్లరి..సోషల్ మీడియాలో వీడియో వైరల్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తనయుడు అల్లు అయాన్( Allu Ayan) గురించి ప్రత్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. స్టార్ హీరో బ‌న్నీ కొడుకుగా కాకుండా చిన్న‌త‌నంలోనే త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య  డంకీ ( Dunky) సినిమాలోని.. లుట్ పుట్ గయాపాట పాడుతూ బాగా వైరల్ అయ్యాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు అల్లు అయాన్‌కు సంబంధించి అల్ల‌రిచేసే వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటాయి. 

అయితే, ప్రస్తుతం తన తాత అల్లు అరవింద్ (Allu Aravind)తో క్రికెట్ ఆడుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇందులో అల్లు అరవింద్ బౌలింగ్ చేస్తుండగా అయాన్ బ్యాటింగ్ చేస్తూ షాట్లు కొట్టారు. దీంతో తాత బౌలింగ్..మనవడు బ్యాటింగ్ అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

కాగా, వరుస సినిమాలను నిర్మిస్తూ..ఇలా సరదాగా మ‌న‌వ‌డితో క్రికెట్ ఆడుతున్న అల్లు అర‌వింద్ ను చూసి సూపర్ సార్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర‌వింద్ ప్ర‌స్తుతం నాగ చైతన్య‌తో ‘తండేల్’ అనే మూవీ నిర్మిస్తున్నాడు.