Allu Arjun: అల్లు అరవింద్ బర్త్ డే సెలెబ్రేషన్స్.... పుష్ప కా బాప్ అంటూ తండ్రికి విషెస్ చెప్పిన బన్నీ..

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పుట్టినరోజు కావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తండ్రికి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలిపాడు. ఇందులోభాగంగా "పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మీ ఉనికితో మా జీవితాలను చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు." అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు. అలాగే కుటుంబ సభ్యులతో కలసి కేక్ కట్ చేస్తున్న ఫొటోస్ కూడా షేర్ చేశాడు. ఇందులో కొడుకులు అల్లు శిరీష్, బాబీ, అల్లు అర్జున్, కోడలు అల్లు స్నేహా రెడ్డి తదితరులు కేక్ కట్ చేస్తూ అల్లు అరవింద్ సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. 

అయితే ఈ ఫోటోలలో "పుష్ప కా బాప్" అని రాసి తయారు చేసిన కేక్ ఆసక్తికరంగా మారింది. ఈ ఫోటోని అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీంతో పలువురు బన్నీ అభిమానులు కూడా ఈ కేక్ ఫోటోని షేర్ చేస్తూ అల్లు అరవింద్ కి విషెష్ చెబుతున్నారు. అల్లు అర్జున్ గత ఏడాది చివరిలో వచ్చిన పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించగా ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు. 

ALSO READ | బాలీవుడ్ కి బన్నీ.. రామ్ చరణ్ కి సాధ్యం కానిది అల్లు అర్జున్ వల్ల అవుతుందా..?

అంతేకాదు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.1800 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. టాలీవుడ్ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో పుష్ప క్యారెక్టర్ పేరునే కేక్ పై రాసి విషెష్ చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అరవింద్ తెలుగులో తండేల్ అనే సినిమా ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అల్లు అర్జున్ సినిమాని కూడా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది.