Allu Arjun: బాలకృష్ణకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏం చెప్పారంటే?

Allu Arjun: బాలకృష్ణకు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్.. ఏం చెప్పారంటే?

నందమూరి బాలకృష్ణకు (జనవరి 25న) ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తెలిసిందే. సినీ రంగంలో ఆయ‌న చేసిన కృషికి గాను బాల‌య్య‌ను కేంద్ర ప్ర‌భుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో తెలుగు సినీ హీరోలు బాలకృష్ణకు విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read:-కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది..

ఈ క్రమంలో (జనవరి 27న) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ X లో బాలకృష్ణకు శుభాకాంక్ష‌లు తెలిపాడు." భారత మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినిమా రంగానికి అందించిన కృషికి ఈ గుర్తింపుకు మీరు అర్హులు" అంటూ అల్లు అర్జున్ X లో రాసుకోచ్చాడు.

అలాగే, ఇండియన్ సినీ రంగంలో బాల‌య్య‌తో పాటు పద్మభూషణ్ వ‌రించిన న‌టుడు అజిత్ కుమార్‌తో పాటు శోభ‌న‌, శేఖర్ క‌పూర్‌, అనంత్ నాగ్‌ల‌కు బన్నీ శుభాకాంక్ష‌లు తెలిపాడు.

ఇటీవలే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్‌స్టాపబుల్‌ విత్ NBK’ షోకి వచ్చారు. ఈ షోలో బాలయ్యతో బన్నీ తెగ సందడి చేశారు. అంతేకాకుండా ఈ షోలో బాలకృష్ణ అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకి.. అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానాలు ఇస్తూ ప్రేక్షకుల్ని తెగ ఖుషి చేశారు.

సినీ విభాగంలో మరికొంత మందికి:

టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శోభన కి కూడా పద్మభూషణ్‌ అవార్డు లభించింది. నటి శోభన హీరోయిన్ గా మాత్రమే కాకుండా భరతనాట్యం డ్యాన్సర్ గా పలు ప్రదర్శనలు ఇచ్చింది. తమిళ్ హీరో అజిత్ కుమార్ కి పద్మభూషణ్‌ అవార్డు వరించింది. కర్ణాటక నుంచి కేజీయఫ్ మూవీ ఫేమ్ నటుడు, రైటర్ అనంత్ నాగ్ కి పద్మభూషణ్‌ అవార్డు లభించింది. ఇక బాలీవుడ్ నుంచి అరజిత్ సింగ్ (పద్మశ్రీ), శేఖర్ కపూర్ (పద్మభూషణ్‌) తదితరులకి అవార్డులు లభించింది. తాజాగా వీరందరికీ అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలిపారు.