
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ పుట్టిన రోజు సందర్భంగా బన్నీ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెష్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా "మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే … హ్యాపీ బర్త్‌డే మై చిన్ని బాబు #AlluAyaan" అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. అలాగే అల్లు అయాన్ నవ్వుతున్న లేటెస్ట్ ఫోటోని కూడా షేర్ చేశాడు.
ఈ ట్వీట్ పై బన్నీ ఫ్యాన్స్ స్పందిస్తూ అయాన్ కి విషెష్ తెలుపుతున్నారు. అయితే ఇంకొందరు ఫ్యాన్స్ ఏకంగా అయాన్ పుట్టిన రోజు కావడంతో కేక్ కటింగ్, అనాథ ఆశ్రమంలో అన్నదానం వంటివి చేస్తున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా అయాన్, బన్నీ ఫోటోలని గిబ్లి ఆర్ట్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసిన ఫోటోలని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
Also Read : నాని HIT-3లో కోలీవుడ్ స్టార్ హీరో
Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc
— Allu Arjun (@alluarjun) April 3, 2025
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అయాన్ కి 11 సంవత్సరాలు. దీంతో ఈ ఏడాది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తండ్రిలాగే అల్లు అయాన్ కి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా గతంలో రామ్ చరణ్ రంగస్ధలంలోని డైలుగులు చెబుతూ చేసిన రీల్స్ వైరల్ అయ్యాయి. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో అల్లు అయాన్ చిన్నపాటి గెస్ట్ రోల్ చేయనున్నట్లు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకూ మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.