AlluArjujn: కష్టం మీది.. ఇమేజ్ నాది.. సక్సెస్ క్రెడిట్ అంతా అతనికే సొంతం: హీరో అల్లు అర్జున్

AlluArjujn: కష్టం మీది.. ఇమేజ్ నాది.. సక్సెస్ క్రెడిట్ అంతా అతనికే సొంతం:  హీరో అల్లు అర్జున్

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం పాన్ ఇండియా వైడ్‌‌ బ్లాక్ బస్టర్‌‌‌‌ సక్సెస్ సాధించి రికార్డులు బ్రేక్ చేసింది. ఇటీవల ఓటీటీలోకి రాగా, హ్యూజ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. టీమ్ మెంబర్స్‌‌,  డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ షీల్డ్స్‌‌ ప్రదానం చేశారు.

అనంతరంహీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.  పోస్టర్స్‌‌లో కనిపించింది నేను కాదు టీమ్ అందరూ నాపై చూపించిన ప్రేమ. కష్టం మీది.. ఇమేజ్ నాది. మైత్రి సంస్థ నిర్మాతలు లేకుండా ‘పుష్ప’ ఫ్రాంచైజీ సాధ్యం కాదు. ఒక పాట మిలియన్ వ్యూస్‌‌ ఎలా చేస్తుంది అనుకున్న నాకు, దేవిశ్రీ బిలియన్ వ్యూస్‌ను చూపించాడు.

డీవోపీ కూబా.. హమారే దిల్ రూబా.జాతర ఎపిసోడ్స్‌‌లో నా ఎక్స్‌‌ప్రెషన్స్ అంత బాగా రావడానికి కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ కారణం. నా ఇతర కొరియోగ్రాఫర్స్‌‌, ఫైట్ మాస్టర్స్‌‌ అందరికీ నా థ్యాంక్స్. అలాగే రష్మిక, ఫహద్ ఫాజిల్, సునీల్ సహా నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాను సపోర్ట్ చేసిన అన్ని సినిమా ఇండస్ట్రీలు, భాషతో సంబంధం లేకుండా హిట్ చేసిన అందరు ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని చెప్పాడు.

సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఒక సినిమాకు నటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఎంతైనా చేయొచ్చు.. కానీ అందరికీ హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క దర్శకుడే. అందరికీ క్రెడిట్ ఇచ్చి తను మాత్రం క్రెడిట్ తీసుకోడు. మా అందరి క్రెడిట్ సుకుమారే. ఒక సినిమాలో ఏది బాగున్నా, ఎవరి వర్క్ బాగున్నా.. అది ఆ దర్శకుడు దానికి ఇచ్చే స్పేస్ వల్లే.

సినిమాలో పలానా క్రాఫ్ట్ బాగుంది అంటే అది ఆర్టిస్ట్‌‌, టెక్నీషియన్ గొప్పతనం కాదు.. దర్శకుడి గొప్పతనం. ఇందులో నా పెర్ఫార్మెన్స్ అంత బాగుంది అంటే ఆ క్రెడిట్ సుకుమార్‌‌‌‌దే.మమ్మల్నందరినీ గైడ్ చేసిన తనకు థ్యాంక్స్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్టాండింగ్‌‌ ఒవేషన్‌‌తో సుకుమార్‌‌‌‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను చూసి గర్వపడుతోంది.

సుకుమార్ నాకు ఓ పర్సన్ కాదు.. ఎమోషన్. తనకు నేను బిగ్గెస్ట్‌‌ ఫ్యాన్‌‌ను. తను ఓ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. టీమ్ అందరికీ దర్శకుడు సుకుమార్ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. నిర్మాతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ, నటులు సునీల్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సహా టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.