Allu Arjun Sukumar: అల్లు అర్జున్‌ను కౌగిలించుకున్న సుకుమార్‌.. పుష్ప 2 టీమ్ స్టాండింగ్ ఓవేష‌న్.. వీడియో వైరల్

Allu Arjun Sukumar: అల్లు అర్జున్‌ను కౌగిలించుకున్న సుకుమార్‌.. పుష్ప 2 టీమ్ స్టాండింగ్ ఓవేష‌న్.. వీడియో వైరల్

అల్లు అర్జున్- సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబోలో వచ్చిన పుష్ప 2  (Pushpa 2) ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి రికార్డులన్నీ బద్దలు కొట్టింది. నెట్ వసూళ్లు దాదాపు రూ.1225.65కోట్లకి పైగా చేసింది. ఇందులో తెలుగులో రూ. 338.73కోట్లు, హిందీలో రూ.806.46 కోట్లు వసూళ్లు చేసి భారీ విజయం అందుకుంది.

ఈ నేపథ్యంలో పుష్ప 2 గ్రాండ్ స‌క్సెస్ మీట్ శ‌నివారం (ఫిబ్రవరి 8న) హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. పుష్ప 2 సినిమా కోసం ఐదు నిమిషాల నుంచి ఐదు సంవ‌త్స‌రాలు పనిచేసిన ప్ర‌తి ఒక్క‌రికి థాంక్స్ చెప్పారు అల్లు అర్జున్.

అలాగే పుష్ప 2లో నా పోస్ట‌ర్‌ను చూసిన‌ ప్ర‌తిసారి దాని వెనుక ఉన్న‌ వెయ్యి, రెండు వేల మంది ఎన‌ర్జీ ప్రేమ క‌నిపించేది. క‌ష్టం మీది ఇమేజ్ నాది అంటూ అల్లు అర్జున్ మాట్లాడుతోన్న టైమ్‌లో సుకుమార్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఆ వెంటనే స్టేజ్‌పైకి వ‌చ్చి అల్లు అర్జున్‌ను కౌగిలించుకున్నారు. సుకుమార్‌కు అల్లు అర్జున్‌తోపాటు పుష్ప 2 టీమ్ మొత్తం స్టాండింగ్ ఓవేష‌న్ ఇచ్చింది. ఈ మూమెంట్ చూడటానికి ఐకాన్ ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలవేమో అన్నట్టుగా ఉంది. 

సుకుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘ఒక సినిమాకు నటులు, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్ ఎంతైనా చేయొచ్చు.. కానీ అందరికీ హిట్ ఇచ్చేది మాత్రం ఒక్క దర్శకుడే. అందరికీ క్రెడిట్ ఇచ్చి తను మాత్రం క్రెడిట్ తీసుకోడు. మా అందరి క్రెడిట్ సుకుమారే. ఒక సినిమాలో ఏది బాగున్నా, ఎవరి వర్క్ బాగున్నా.. అది ఆ దర్శకుడు దానికి ఇచ్చే స్పేస్ వల్లే.

సినిమాలో పలానా క్రాఫ్ట్ బాగుంది అంటే అది ఆర్టిస్ట్‌‌, టెక్నీషియన్ గొప్పతనం కాదు.. దర్శకుడి గొప్పతనం. ఇందులో నా పెర్ఫార్మెన్స్ అంత బాగుంది అంటే ఆ క్రెడిట్ సుకుమార్‌‌‌‌దే. మమ్మల్నందరినీ గైడ్ చేసిన తనకు థ్యాంక్స్. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్టాండింగ్‌‌ ఒవేషన్‌‌తో సుకుమార్‌‌‌‌కు థ్యాంక్స్ చెబుతున్నాం. యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ తనను చూసి గర్వపడుతోంది.

సుకుమార్ నాకు ఓ పర్సన్ కాదు.. ఎమోషన్. తనకు నేను బిగ్గెస్ట్‌‌ ఫ్యాన్‌‌ను. తను ఓ జీనియస్’ అంటూ ప్రశంసలు కురిపించాడు. టీమ్ అందరికీ దర్శకుడు సుకుమార్ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. నిర్మాతలు నవీన్, రవిశంకర్, సీఈవో చెర్రీ, నటులు సునీల్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య సహా టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.