Pushpa 2 OTT: గ్లోబల్ రేంజ్‍లో పుష్ప 2 ట్రెండింగ్.. కానీ, థియేటర్ వసూళ్లకు బ్రేక్.. 60వ రోజు ఎంతంటే?

Pushpa 2 OTT: గ్లోబల్ రేంజ్‍లో పుష్ప 2 ట్రెండింగ్.. కానీ, థియేటర్ వసూళ్లకు బ్రేక్.. 60వ రోజు ఎంతంటే?

పుష్ప 2 (రీలోడెడ్ వెర్షన్) జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ స్వాగ్కి ఇంటర్నేషనల్ వైడ్ సినీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ OTTలో దూసుకెళ్తోంది. నెట్‍ఫ్లిక్స్ గ్లోబల్ సినిమాల లిస్టులో భారీ వ్యూస్‍తో ఆరో స్థానంలో పుష్ప 2 ట్రెండ్ అవుతోంది. త్వరలో ఈ మూవీ ఇండియా ట్రెండింగ్‍ మూవీస్ టాప్-1 జాబితాలో సత్తాచాటడానికి దగ్గర్లో ఉంది. అయితే, ఈ మూవీ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్ కలెక్షన్స్ పూర్తిగా పడిపోయాయి. 'పుష్ప 2' ఆదివారం (ఫిబ్రవరి 2న) 60వ రోజున రూ.7 లక్షలు వసూలు చేసింది.

ALSO READ | లావణ్య, రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపు.. మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు..

అయితే, పుష్ప 2 విడుదలై 2 నెలలు కావొస్తున్నా హిందీ బాక్సాఫీస్ నుండే వసూళ్లు వచ్చాయి. ఇపుడు ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. దానికి కారణం లేకపోలేదు. మొదట ఈ సినిమా OTTలో కేవలం తమిళం, తెలుగు, మలయాళం భాషలలో స్ట్రీమింగ్కి వచ్చింది. హిందీలో మాత్రం రాలేదు. కానీ అభిమానుల డిమాండ్ కారణంగా, హిందీ స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవ్వడంతో కలెక్షన్స్ తగ్గిపోయాయి.

లేటెస్ట్ టాక్ ప్రకారం.. 60వ రోజుకి చేరుకున్న పుష్ప గాడి రూల్ థియేటర్ వసూళ్లకు బ్రేక్ పడినట్లే అని తెలుస్తోంది. 2024 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ.1900 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.1233.62 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడించాయి.