Pushpa 2 X Review: ‘పుష్ప 2’ మూవీ X రివ్యూ.. ప్రీమియర్స్ టాక్‌ ఎలా ఉందంటే..?

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘పుష్ప2 ది రూల్’.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించిన ఈ చిత్రం నేడు గురువారం (డిసెంబర్ 5న) వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల అయింది.

భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ డిసెంబర్ 4 అర్ధరాత్రి 9:30 గంటలకు మేకర్స్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూడేళ్ళుగా ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప గాడి రూల్ అల్లు ఫ్యాన్స్  కి ఎలా అనిపించింది. నిజంగానే పుష్ప గాడి మాస్ ఇంటర్నేషనల్ ను టచ్ చేసిందా లేదా అనేది X రివ్యూలో తెలుసుకుందాం.

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘పుష్ప2 ది రూల్’.  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌తో నిర్మించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 5న) వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల అయింది.

భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ డిసెంబర్ 4 అర్ధరాత్రి 9:30 గంటలకు మేకర్స్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. మూడేళ్ళుగా ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప గాడి రూల్ అల్లు ఫ్యాన్స్  కి ఎలా అనిపించింది. నిజంగానే పుష్ప గాడి మాస్ ఇంటర్నేషనల్ ను టచ్ చేసిందా లేదా అనేది X రివ్యూలో తెలుసుకుందాం.

X లో పుష్ప 2 మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. పుష్ప గాడి రూల్ కి థియేటర్స్ మోత మోగిపోతుందని అంటున్నారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్‌లో కంటే సెకండ్ పార్ట్‌లో ఇంకా పవర్ ఫుల్‌గా సుకుమార్ చూపించారని వినిపిస్తోంది.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. "పుష్ప వైల్డ్‌ఫైర్ ఎంటర్‌టైనర్.. అన్ని విధాలుగా సాలిడ్ ఫిల్మ్... అల్లుఅర్జున్‌కి అన్ని అవార్డులు రిజర్వ్ చేయండి. తన అద్భుతమైన యాక్టింగ్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు.  సుకుమార్ ఊహించని మలుపులతో నిండిన కథనాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. 

మరో ప్లస్ ఏమిటంటే.. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అదిరిపోయే డైలాగ్‌లు, ఫస్ట్ పార్ట్ వలే సెకండ్ పార్ట్ కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. పుష్ప2 తో ఇండియాలో అత్యుత్తమ నటులలో ఒకరిగా అల్లుఅర్జున్ స్థాయిని పెంచేసింది. అతని యాక్టింగ్ ట్రేడ్‌మార్క్, డైలాగ్ డెలివరీ, విభిన్నమైన నటన ఆడియన్స్ కి అద్భుతమైన ఫీలింగ్ ఇస్తోందని" తరణ్ ఆదర్శ్ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు.  

ఒక నెటిజన్ ట్వీట్ చేస్తూ.. పుష్ప పార్ట్ 1తో పోలిస్తే సెకండ్ పార్ట్ యాక్షన్ ప్యాక్ చేయబడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని.. ఫస్ట్ పార్ట్  చివరి గంటలో సినిమా అదిరిపోయిందని అంటున్నారు. కథనం కొంచెం నెమ్మదిగా అనిపిస్తుందని.. అయితే పుష్ప రాజ్ డైలాగ్స్ సినిమాని నడిపిస్తాయని.. సెకండాఫ్ మంచి అంచనాలతో షురూ అయ్యి.. జాతర సీక్వెన్స్ తో వచ్చే సీన్స్ అద్భుతంగా వచ్చిందని కామెంట్ చేశాడు. కానీ ఈ సీక్వెన్స్ తర్వాత, సినిమా చివరి గంటలో ఎటువంటి లక్ష్యం లేకుండా బాగా పడిపోయిందని.. మరియు చివరి వరకు సాగదీత ఉందని పోస్ట్ చేశాడు. ఇక ఫస్ట్ పార్ట్ కంటే ఈ చిత్రం పూర్తి అంచనాలను చేరుకోకపోవచ్చు. కానీ, అల్లు అర్జున్ వరల్డ్ టాప్ యాక్టర్ లో చేరుతాడని కామెంట్ చేశాడు.

పుష్ప 2 డీసెంట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌.ఫస్టాఫ్‌ బాగుంది. సెకండాఫ్‌ స్టార్టింగ్‌ బాగుంది కానీ చివరి గంట డ్రాప్‌ అయినట్లుగా అనిపించిదంటూ ఓ నెటిజన్‌ 3 రేటింగ్‌ ఇచ్చాను.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటవిశ్వరూపం, సుకుమార్‌ డైరెక్షన్‌ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

పుష్ప రాజ్ పవర్ ఫుల్ ఎంట్రీ.. క్లైమాక్స్‌తో కూడిన కమర్షియల్ యాక్షన్ డ్రామా.. అల్లుఅర్జున్, ఫహద్ ఫాసిల్ ల సాలిడ్ యాక్టింగ్స్, జాతర సీక్వెన్స్ & ఇంటర్వెల్ సీక్వెన్స్.. ఇలాంటి మూవీ ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూడలేదు. సామ్ సీ యస్ మాస్ BGM & ఎలివేషన్స్ అదిరిపోయాయి.

అల్లు అర్జున్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అని.. ఈ సినిమా కోసం బన్నీ తన శక్తిని అంత ఇచ్చాడని.. ఫస్టాఫ్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్, మాస్ సీన్స్,  BGM, కెమెరా విజువల్స్ అదిరిపోయాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.