Pushpa 2 Ticket Price: సోమవారం (Dec 9న) తగ్గిన పుష్ప2 టికెట్‌ ధరలు.. ఏ థియేటర్‌లో ఎంతంటే?

పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule).. ప్రపంచ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలైన మూడ్రోజుల్లోనే రూ.621 కోట్లు సాధించి వీకెండ్ను విజయవంతంగా ముగించింది. 

ఇదిలా ఉంటే.. ఇవాళ సోమవారం (డిసెంబర్ 9) నుండి సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 9 నుంచి 16 సోమవారం వరకు సింగల్ స్క్రీన్స్ లో రూ.105, మల్టీప్లెక్స్ లలో రూ.150 ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మరింత మంది ప్రేక్షకులు పుష్ప 2 సినిమా చూడటానికి క్యూ కట్టే అవకాశం పెరిగింది.

ఎందుకంటే టికెట్ ధరలు తగ్గితే సినిమాను చూద్దాం అని ఆశగా ఎదురు చూస్తున్నారు సామాన్య ప్రేక్షకులు. అయితే నైజాం ఏరియాలో ప్రభుత్వం అనుమతించిన ధరతో పోలిస్తే టికెట్ ధరలు తగ్గినట్లుగా బుక్‌మై షోలో చూపిస్తోంది. ఈ వెబ్‌సైట్‌లో సింగిల్ స్క్రీన్‌లో బాల్కనీ టికెట్ ధర రూ. 200, ఫస్ట్ క్లాస్ రూ. 140, సెకండ్ క్లాస్ రూ.80. మల్టీప్లెక్స్‌లో రూ.395 (రెండింటిపై జీఎస్టీ అదనం) చూపిస్తోంది. 

Also Read :- మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు కాపలా !

అలాగే మల్టీప్లెక్స్‌లోనూ ఆ మేరకు ధరను తగ్గించారు. కాగా పెంచిన టికెట్ ధరలు కేవలం ప్రీమియర్స్ కు మాత్రమేనని, ప్రేక్షలులకు అందుబాటు ధరలో టికెట్ రేట్స్ ఉండేలా చూసుకుంటామని నిర్మాతలు హామీ ఇచ్చారు. ఇక ఇవాళ నుంచి తగ్గిన టికెట్ ధరలతో ఈ వీకెండ్ ఎలాంటి వసూళ్లతో ముగుస్తుందో చూడాలి.