నంద్యాల వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు

ఏపీ రాజకీయాల్లో చివరి రోజు బిగ్ ట్విస్ట్.. అల్లు అర్జున్ ప్రచారం కాక రేపుతోంది. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న శిల్ప రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయటం రాజకీయంగా కలకలం రేపుతోంది. 

నంద్యాల వచ్చిన అల్లు అర్జున్.. వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డి ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన నంద్యాల జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. నంద్యాల మొత్తం శిల్ప ఇంటి దగ్గరే ఉన్నట్లు పోటెత్తారు. శిల్పకు చేయిపట్టుకుని.. పైకి ఎత్తి చూపిస్తూ.. తన మద్దతు ప్రకటించటం విశేషం. 

అల్లు అర్జున్.. శిల్ప రవిచంద్రారెడ్డిలు మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే మద్దతు ఇచ్చినట్లు తెలుస్తుంది. వైసీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి.. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించటం చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే.. తన కుటుంబ సభ్యుల్లో ఒకరు అయిన పవన్ కల్యాణ్ కు మద్దతుగా పిఠాపురం వెళ్లలేదు అల్లు అర్జున్. కేవలం ఒక్క ట్విట్ మాత్రమే మద్దతు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థికి మాత్రం నంధ్యాల వెళ్లి మద్దతు ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.