ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun)కు పుష్ప సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు(National award) అందుకున్న విషయం తెలిసిందే. 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలోఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్.అలాగే తెలుగు సినిమా అయినటువంటి పుష్ప గురించి ఇండియా వైడ్గా మాట్లాడుకునేలా చేశాడు. అంతేకాదు..పుష్ప సినిమా గురించి విదేశాల్లో కూడా పలు ఫిలిం ఫెస్టివల్స్ లలోప్రస్తావన వచ్చేలా తీసుకొచ్చాడు.
అయితే..ఇప్పుడు లేటెస్ట్గా అల్లు అర్జున్ కు తెలుగు సినిమా స్థాయిని..అలాగే ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పే మరో అద్భుత అవకాశం దక్కింది అల్లు అర్జున్ కి.
ప్రసెంట్ జర్మనీలోనీ బెర్లిన్‌లో జరిగే ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్(Berlin film festival) లో ఇండియా సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పడానికి అల్లు అర్జున్ బయలుదేరాడు. అక్కడ పుష్ప ది రైజ్ స్పెషల్ స్క్రీనింగ్ షో వేయనున్నారు. ఇక ఆ తర్వాత ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు పుష్పరాజ్.
ప్రస్తుతం బెర్లిన్ వెళుతున్న అల్లు అర్జున్కు సంబంధించిన విజువల్స్..ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత మంచి అవకాశాన్ని అందుకోవడం..మన సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయి వేదికలపై చర్చించడం విశేషం అని చెప్పుకోవాలి. అందులోనూ టాలీవుడ్ నుంచి వెళుతున్న ఏకైక హీరో అల్లు అర్జున్ కావడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం అని చెప్పాలి.
Icon star ? @alluarjun is en route to Germany ?? to represent the richness of Indian cinema at a prestigious film festival in Berlin.#AlluArjun #Pushpa2TheRule #Pushpa pic.twitter.com/lFFTYk5qaR
— Shreyas Sriniwaas (@shreyasmedia) February 15, 2024
పుష్ప 2 సినిమా విషయానికి వస్తే..ప్రస్తుతం పుష్ప 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ లేటెస్ట్ షెడ్యూల్ కోసం త్వరలో పుష్ప రాజ్ ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు సమాచారం.ఈ ఎపిసోడ్ లో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు..కొన్ని కీలకమైన సీన్స్ అక్కడే షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జపాన్ షెడ్యూల్ కూడా పుష్ప 2 లో హైలెట్ గా నిలిచేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఏదేమైనా గంగమ్మ తల్లి అవతారంతో పుష్ప రాజ్ ఎంట్రీ ఇచ్చిన మొదలు..ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్..మైత్రీ మూవీమేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.