Allu Arjun: పుష్ప2 ప్రీమియర్‌కు రానున్న అల్లు అర్జున్.. హైదరాబాద్లో ఏ థియేటర్ అంటే?

Allu Arjun: పుష్ప2 ప్రీమియర్‌కు రానున్న అల్లు అర్జున్.. హైదరాబాద్లో ఏ థియేటర్ అంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2 (Pushpa2) ప్రీమియర్‌కు హాజరు కానున్నట్లు సమాచారం. ఇవాళ డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ 'సంధ్య 70MM' లో ప్రదర్శించనున్న పుష్ప -2 ప్రీమియర్కి ఐకాన్ రానున్నాడు. అక్కడే ఫ్యాన్స్తో పుష్ప 2 సినిమా చూడనున్నారు.

మూడేళ్ళ తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యాన్స్తో కలిసి సినిమా చూడటానికి సంధ్య థియేటర్కి విచ్చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీమియర్ షోలకి గ్రాండ్గా  ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అల్లు అర్జున్ నిజంగానే వస్తున్నాడా లేదా అనేది మేకర్స్ నుంచి కాసేపట్లో క్లారిటీ రానుంది. 

పుష్ప 2 మూవీ రేపు డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రసవత్తరంగా జరిగాయి. టికెట్ల రేట్లు కూడా అంతే జోరు మీదున్నాయి. అయిన ఎక్కడ తగ్గేదేలే అంటూ జనాలు క్యూ కడుతున్నారు.

Also Read:-ఈడొకడు.. ఇంకా రాలేదేంటా అనుకున్నాం.. వచ్చేశాడయ్యా పుష్ప2 రివ్యూతో..!

భారీ స్థాయిలో12 వేల స్క్రీన్స్కు పైగా వివిధ ఫార్మాట్స్లో పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక మరికొన్నిగంటల్లో పుష్పగాడి తాండవం ఎలా ఉండనుందో చూడాలి.