Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ అప్డేట్.. బన్నీకి జోడిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

Allu Arjun Atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ అప్డేట్.. బన్నీకి జోడిగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు!

అల్లు అర్జున్, అట్లీ (AA22) కాంబినేషన్‍పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బన్నీకి జోడిగా ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇప్పటికే, ఈ మూవీలో ఒక హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరుని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు టాక్. మరో హీరోయిన్గా దిశా పటాని, శ్రద్ధా కపూర్ వంటి వారిని డైరెక్టర్ అట్లీ కలిశారని, వారితో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ, ఇప్పటివరకు వీరిద్దరిలో ఎవరినీ ఖరారు చేయలేదని తెలుస్తోంది. అతి త్వరలోనే AA22లో నటించబోయే హీరోయిన్స్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

AA22 మూవీ: 

సన్ పిక్చర్స్ బ్యానర్‌‌పై కళానిధి మారన్ ‌‌భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  అల్లు అర్జున్ బర్త్‌‌డే (ఏప్రిల్ 8) సందర్భంగా స్పెషల్ వీడియోతో ఈ క్రేజీ కాంబోను అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌‌తో హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇందులో చూపించారు.

దీనికోసం లాస్‌‌ ఏంజెల్స్‌‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్‌‌, దర్శకుడు అట్లీ,  హాలీవుడ్‌‌ టెక్నీషియన్స్‌‌తో ఇంటారాక్ట్ అయినట్టు, అవతార్ లాంటి భారీ బడ్జెట్‌‌ చిత్రాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్‌‌ దీనికి వర్క్ చేయనున్నట్టు ప్రకటించారు.

అట్లీ రూపొందించనున్న ఫస్ట్ తెలుగు మూవీ, అందులోనూ ప్రెస్ట్రీజియస్  సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండటంతోపాటు ఈ అనౌన్స్‌‌మెంట్ వీడియో  సినిమాపై భారీ అంచనాలు పెంచింది.

ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక మిగతావి నటి నటుల రెమ్యునరేషన్. మొదటి సారి అల్లు అర్జున్ - అట్లీల సైన్స్ ఫిక్షన్ కలయిక ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందనే ఆసక్తి నెలకొంది.