పవన్ విక్టరీపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?

పవన్ విక్టరీపై అల్లు అర్జున్ ఏమన్నారంటే?

పిఠాపురం అసెంబ్లీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69 వేల ఓట్లతో విజయం సాధించారు. అంతేగాకుండా  జనసేన ఇంకో 20 స్థానాల్లో  ఆధిక్యంలో కొనసాగుతోంది.  పవన్ కళ్యాణ్ గెలుపుపై  అల్లు అర్జున్ ట్విట్టర్లో స్పందించారు. పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి,  అంకితభావం, నిబద్దత ఎలప్పుడూ నా  హృదయాన్ని హత్తుకున్నాయి. ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే..ఇప్పటికే  175 స్థానాలకు గానూ  టీడీపీ 136, జనసేన 21, బీజేపీ 8, వైస్సార్సీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు లోక్ సభ స్థానాల్లో కూడా కూటమి అత్యధిక సీట్లు గెలుచుకోబోతుంది. 25 లోక్ సభ స్థానాలకు గానూ టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3,వైసీపీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.