![నా ఇల్లు కూల్చొద్దు: ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/allu-arjun-uncle-chandra-shekar-reddy-approached-prajavani_Fqy6aABcoE.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ, కాంగ్రెస్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంటి స్థలం కోసం ప్రజావాణికి హాజరయ్యారు. రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని సోమవారం ( ఫిబ్రవరి 10, 2025 ) నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు విజ్ఞప్తి చేశారు చంద్రశేఖర్ రెడ్డి. కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణ లో తన ఇంటి స్థలం సేకరణ పై పునరాలోచన చేయాలని కోరారు.
రోడ్డు విస్తరణలో తన ఇళ్లు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు చంద్రశేఖర్ రెడ్డి.కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.. పార్కు చుట్టూ రోడ్ల విస్తరణ, అండర్ పాసులు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతులను కూడా జారీ చేసింది ప్రభుత్వం.
పార్క్ చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను నిర్మించనున్నారు. పార్క్ ఎంట్రన్స్ నుంచి.. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ 45, ఫిలింనగర్, అగ్రసేన్ మహరాజ్ విగ్రహం, బసవతారకం హాస్పిటల్ వైపు అండర్ పాసులు, ఫ్లై ఓవర్ల నిర్మించనున్నారు.