Allu Arjun Wax Statue: మేడమ్ టుస్సాడ్స్లో కొలువు దీరిన ఐకాన్ మైనపు విగ్రహం..నా ఆర్మీకి స్పెషల్ థ్యాంక్స్: అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.తాజాగా దుబాయ్‌లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం(Madame Tussauds Museum)లో ఐకాన్ స్టార్ మైనపు విగ్రహం కొలువు దీరింది.ఈ అరుదైన మైనపు విగ్రహాన్ని అల్లు అర్జున్ స్వయంగా దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు వెళ్లి తన సొంత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ అరుదైన అద్భుత క్షణాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఎమోషనల్ ఫీల్ అవుతూ (X) ద్వారా అభిప్రాయాన్ని పంచుకున్నారు.

"ఈ రోజు చాలా స్పెషల్ డే..నా సినీ కెరీర్లో మొదటి చిత్రం  గంగోత్రి సరిగ్గా (మార్చి 28న 2003లో) విడుదలైంది. అలాగే ఈరోజు 2024 మార్చి 28న నేను నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ ఆవిష్కరించబడటం గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఇది నా 21 సంవత్సరాల మరపురాని ప్రయాణం.

Also Read: నన్ను చేసుకునే వాడు అలాంటి క్యారెక్టర్ తో ఉండాలి

ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞుడను. అనుక్షణం నా అభిమానుల (ఆర్మీ) వారి అమితమైన ప్రేమ..ఎనలేని మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరినీ మరింత గర్వించేలా సినిమాలు చేస్తానని ఆశిస్తున్నాను" అంటూ తనదైన శైలిలో పోస్ట్ చేశారు. 

మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించబడిన ఫోటో బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ ఐకానిక్ స్టైల్ తరహాలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి విగ్రహం వెనక ఫొటో మాత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫ్రంట్ ఫోటో కోసం అల్లు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటో పక్క బన్నీ నిల్చున్నాడు. ఇక్కడ ఒరిజినల్ ఏదో విగ్రహం ఏదో అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన బన్నీ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత ఇంతటి విశేష గౌరవాన్ని సొంతం చేసుకోవడం పట్ల సినీ ఫ్యాన్స్ తో పాటు ప్రముఖులు స్పెషల్ విషెస్ చెబుతున్నారు.