కిమ్స్​ ఆస్పత్రిలో శ్రీతేజ్​ ను పరామర్శించిన అల్లు అర్జున్​

కిమ్స్​ ఆస్పత్రిలో శ్రీతేజ్​ ను పరామర్శించిన అల్లు అర్జున్​

కిమ్స్​ ఆస్ప్రత్రి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు.   సంధ్యా ధియేటర్​ ఘటనలో గాయపడి.. చికిత్స పొందుతున్న శ్రీ తేజ్​ను అల్లు అర్జున్​ పరామర్శించారు.  తాను శ్రీతేజ్​ పరామర్శించాలని ముందుగానే రామ్​ గోపాల్​ పేట పోలీసులు అల్లు అర్జున్​ సమాచారం ఇచ్చారు.  దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ఎస్కార్ట్​ వాహనంలోనే అల్లు అర్జున్​ కిమ్స్​ ఆస్పత్రికి వెళ్లారు.   దిల్​ రాజు కూడా కిమ్స్​ ఆస్పత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు.  శ్రీ తేజ్​ ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారని సమాచారం.  

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. తొక్కిస‌లాట ఘ‌ట‌నపై రాంగోపాల్ పేట పోలీసులు కేసు న‌మోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి నాంపల్లికోర్టులో హాజ‌రుప‌రిచారు. నాంప‌ల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించ‌గా అదే రోజు అల్లు అర్జున్ న్యాయ‌వాదులు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది.రిమాండ్ గ‌డువు ముగిసిన త‌రువాత అల్లు అర్జున్ వ‌ర్చువ‌ల్‌గా నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రు అయ్యాడు. రెగ్యుల‌ర్ బెయిల్ కోసం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాంప‌ల్లి కోర్టు అల్లు అర్జున్‌కు ష‌ర‌తుల‌తో కూడిన రెగ్యుల‌ర్ బెయిల్‌ను మంజూరు చేసింది.