
పుష్ప 2: ది రూల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులోభాగంగా విదేశాలు తిరుగుతూ చిల్ అవుతున్నాడు. అయితే శనివారం అల్లు అర్జున్ దుబాయ్ లోని అబుదాబిలో ఉన్నటువంటి బాప్స్ హిందూ మందిర్ (బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ) ని సందర్శించాడు. దీంతో ఆలయ అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు చేసి బన్నీ ని ఆహ్వానించారు. బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించాడు.. అనంతరం ఆలయ అధికారులు బాప్స్ హిందూ మందిర్ విశిష్టత గురించి తెలియజేశారు.
అయితే బన్నీ త్వరలోనే ప్రారంభం కానున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో సినిమాలకి కమిట్ అయ్యాడు. ఇందులో మొదటగా అట్లీ కుమార్ సినిమా చేయనున్నట్లు ఆమధ్య ఓ సినిమా ఈవెంట్ లో ప్రముఖ సైన్ నిర్మాత రవిశంకర్ తెలిపాడు. దీంతో అప్పటినుంచి అట్లీ కుమార్ - బన్నీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని దాదాపుగా రూ.400 కోట్లు బడ్జెట్ తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.