పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్.. : అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే..

పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్.. : అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా బుధవారం (డిసెంబర్ 04) రాత్రి సమయంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో జరిగిన సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ నేపథ్యంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అల్లు అర్జున్ ని వైద్య చికిత్సల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో విచారణకి హాజరు పరిచారు. 

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో 'ఫ్లవర్ నహీం , ఫైర్ హై' అనే ట్యాగ్‌లైన్‌తో హూడీని ధరించాడు. ఈ డైలాగ్ పుష్ప 2 హిందీ వెర్షన్ లో ఉంటుంది. నార్త్ లో చాలా పాపులర్ అయ్యింది. ఇక పోలీసులు వచ్చిన సమయంలో గ్రీన్ టీ తాగుతూ కూల్ గా కనిపించాడు. స్టేషన్ కి వెళ్లేముందు తన సోదరుడు శిరీష్, భార్య అల్లు స్నేహ రెడ్డితో కొంతసేపు మాట్లాడాడు. తర్వాత పోలీసులతో మాట్లాడుతూ ఎక్కువమంది పోలీసులతో కాకుండా ఒకరో, ఇద్దరు వచ్చి ఉండాల్సిందని ఎక్కువమంది పోలీసులు రావడంతో తన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నాడు. 

అనంతరం పోలీసుల ఎస్కార్ట్ వాహనంలోనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఈ క్రమంలో పోలీస్ వాహనంలో అల్లు అరవవింద్ కూడా వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ బన్నీ మాత్రం అందుకు నిరాకరించాడు. అలాగే ఈ సంఘటనతో వచ్చిన క్రెడిట్  గుడ్, బ్యాడ్ ఏదైనా తనకే దక్కాలని చెప్పాడు. 

ALSO READ | అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు: శిక్ష ఎన్నేళ్లు పడొచ్చు ?

ఈ విషయం ఇలా ఉండగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (31) మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకి గురి కాగా స్థానికులు దగ్గరిలోని హాస్పిటల్ లో చేర్పించారు. దీంతో చిక్కడ్ పల్లి పోలీసులు పలు సెక్షన్ల క్రింద అల్లు అర్జున్ టీమ్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.  

దీంతో అల్లు అర్జున్ ఇంటికి మెగాస్టార్ కుటుంబ సభ్యులు, సన్నిహితలు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో టవర్ స్టార్ నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నట్లు సమాచారం.