విచారణ అనంతరం చిక్కడ పల్లి పీఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికెళ్లిపోయారు. ఎవరితో మాట్లాడకుండానే కారులో ఇంటికెళ్లారు. బందోబస్తుతో మద్య ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చెప్పారు. ఎప్పుడు రావాలనేది త్వరలో చెబుతామన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పీఎస్ లో పోలీసులు విచారించారు. డిసెంబర్ 21న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు 20 ప్రశ్నలకు అల్లు అర్జున్ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. విచారణలో అల్లు అర్జున్ చాల ప్రశ్నలకు మౌనంగా ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు తెల్వదని చెప్పినట్లు తెలుస్తోంది
ALSO READ | సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోని అరెస్ట్..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా..మరొకరికి గాయాలైన సంగతి తెలిసిందే . ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బౌన్సర్ ఆంటోనీని చిక్కడ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీని గుర్తించిన పోలీసులు డిసెంబర్ 23న అరెస్ట్ చేశారు. సినిమా ఈవెంట్ లు ఎక్కడ జరిగినా బౌన్సర్లకు ఆర్గనైజర్ గా పనిచేస్తుంటాడు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సమయంలో కూడా ఆంటోని బన్నీకి సెక్యూరిటీగానే ఉన్నాడు. కాసేపట్లో ఆంటోనిని సంధ్య థియేటర్ కు తీసుకెళ్ళనున్నారు పోలీసులు.